యుద్ధం ఎఫెక్ట్.. భారీగా పెరగనున్న ధరలు!

0 21,467

ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం కారణంగా ఎలక్ట్రానిక్స్‌ వస్తువుల ధరలు సైతం భారీగా పెరగనున్నాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. సెమీకండక్టర్‌ చిప్స్‌ తయారీలో కీలక ముడి వస్తువులుగా ఉన్న పల్లాడియం, నియాన్‌ లను ఉక్రెయిన్‌- రష్యాలే ఎక్కువగా ఎగుమతి చేస్తున్నాయి. ప్రపంచ దేశాలకు ఎగుమతవుతున్న పల్లాడియంలో 44 శాతం ఒక్క రష్యా నుంచే సరఫరా అవుతోంది. ఇటు ఉక్రెయిన్‌ సైతం 70 శాతం మేర నియాన్‌ను ప్రపంచ దేశాలకు అందిస్తోంది. ప్రస్తుతం ఈ రెండు దేశాలు యుద్ధంలో నిమగ్నం కావడం కారణంగా పల్లాడియం, నియాన్‌ ఎగుమతిపై తీవ్ర ప్రభావం పడనుంది.
యుద్ధం ఎఫెక్ట్.. భారీగా పెరగనున్న ధరలు!
నియాన్, పల్లాడియం సరఫరాలో అంతరాయం ఏర్పడితే సెమీకండక్టర్ల ఆధారంగా నడిచే ఆటోమొబైల్‌ రంగం, స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌ సహా అన్ని ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్స్‌పై ప్రభావం పడనుంది. ప్రస్తుత రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ఇలానే కొనసాగితే ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి సంస్థలు చైనా, అమెరికా, కెనడాను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఆ దేశాల్లోని పల్లాడియం, నియాన్‌ ప్రపంచ అవసరాలకు ఏమాత్రం సరిపోదు. ఫలితంగా సెమీకండక్టర్ల ఉత్పత్తి నెమ్మదించి ఎలక్ట్రానిక్‌ వస్తువుల ధరలు భారీగా పెరిగే ప్రమాదముందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents