ఖనిలో సంబరాలు జరిపిన బిజెపి
భారతీయ జనతా పార్టీ రామగుండం కార్పొరేషన్ శాఖ అధ్యక్షులు గుండబోయిన లక్ష్మణ్ యాదవ్ ఆధ్వర్యంలో ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలలో నాలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అఖండ మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న సందర్భంలో గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో గురువారం బాణాసంచా పేల్చి, స్వీట్లు పంపిణీ చేసి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఆర్టీసీ చైర్మన్, సోమారపు సత్యనారాయణ, భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రావుల రాజేందర్, బిజెపి సీనియర్ నాయకులు వడ్డేపల్లి రామ్ చందర్ పాల్గొని రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్గా భావించిన ఐదు రాష్ట్రాల ఎలక్షన్ లో నాలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోడీ నేతృత్వంలో భారతదేశంలో తిరుగులేని శక్తిగా ఏర్పడబోతోందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ నేతృత్వంలో కాషాయ జెండా రెపరెపలాడడం ఖాయమని వారు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సోమారపు లావణ్య, బిజెపి రాష్ట్ర యువ నాయకులు సోమారపు అరుణ్ కుమార్, కేంద్ర సెన్సార్ బోర్డు నెంబర్ వెంకటస్వామి, బీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు పిడుగు కృష్ణ, బిజెపి కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శులు తడగొండ నర్సయ్య, పల్లి కొండ నర్సింగ్, మంచి కట్ల భిక్షపతి, బీజేపీ కార్పొరేషన్ ఉపాధ్యక్షులు సీత కారి చంద్ర శేఖర్, కుంభాల రాజు, తాడ బోయిన సత్యం, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు బద్రి దేవేందర్, బీజేపీ కార్పొరేషన్ కార్యదర్శి గుర్రాల సందీప్ కుమార్, బి సి మోర్చా కార్పొరేషన్ అధ్యక్షులు చుక్కల రాములు, మండల అధ్యక్షులు డేవిడ్ రాజు, రవి కుమార్, మిట్టపల్లి సతీష్ కుమార్, బండి రాము, చిరంజీవి, మహేష్, పంగ రవి, పుష్పక సంతోష్, సుభాష్, రామకృష్ణ, కొమ్ము శ్రీనివాస్, బీమా, సుధీర్, గుండెబోయిన గట్టయ్య, చిలకల రాజకుమార్, అధిక సంఖ్యలో కార్యకర్తలు నాయకులు పాల్గోన్నారు.