అధికారులకు దిశా నిర్దేశనం

0 255

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితుల ఆర్థిక పరిపుష్టి కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకంలో ఎక్కువ శాతం లభ్దిదారులు వాహనాల యూనిట్లను ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. కాగా దళిత బంధు పథకం అమలులో రవాణా శాఖ అధికారులు కీలక పాత్ర వహించాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా డిప్యూటి ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ మామిండ్ల చంద్ర శేఖర్ గౌడ్ నాలుగు జిల్లాల అధికారులకు దిశా నిర్దేశనం చేశారు.
అధికారులకు దిశా నిర్దేశనం
కరీం నగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్లా జిల్లాల రవాణా శాఖ అధికారులతో ఏర్పాటు చేసిన జూమ్ సమావేశంలో డిటిసి చంద్ర శేఖర్ గౌడ్ మాట్లాడుతూ ఆయా జిల్లాల రవాణా శాఖ అధికారులు త్వరలో షో రూం డీలర్లతో సమావేశం ఏర్పాటు చేసి వారితో వాహనాల ధరల విషయంలో సంప్రదింపులు చేసి తక్కువ ధరకు వాహనాలు లబ్ధిదారులకు అందజేసేలా చూడాలని ఆదేశించారు.

Also Read :

లభ్దిదారులు ఎంచుకున్న వాహన యూనిట్ల స్టాక్ ను అందుబాటులో ఉంచే విధంగా చూడాలని, ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదేశించిన వెంటనే వాహన యూనిట్లు గ్రౌండింగ్ అయ్యేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని రవాణా శాఖ అధికారులను ఆదేశించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents