అక్కడ లీటర్ పెట్రోల్ రూ.254!
ఉక్రెయిన్-రష్యా యుద్ధం అంతర్జాతీయంగా ముడి చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఫలితంగా పలు దేశాల్లో చమురు ధరలు అమాంతం పెరుగుతున్నాయి. ముడిచమురు ధరలకు అనుగుణంగా శ్రీలంకలో పెట్రోల్, డీజిల్ ధరలను చమురు విక్రయ కంపెనీ లంక ఇండియన్ ఆయిల్ కంపెనీ (ఎల్ఐఓసీ) భారీగా పెంచింది. ఇది భారత చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అనుబంధ సంస్థ. తాజా ధరల పెంపుతో అక్కడ ఇంధన ధరలు డబుల్ సెంచరీని దాటేశాయి. శ్రీలంకలో లీటర్ డీజిల్‌పై రూ.75(శ్రీలంక రూపాయి), పెట్రోల్‌పై రూ.50 చొప్పున పెంచినట్లు ఎల్ఐఓసీ తెలిపింది. దీంతో లీటరు పెట్రోల్ ధర రూ.254కు చేరగా.. లీటర్ డీజిల్ ధర రూ.214కు ఎగబాకింది.