చేనేత జౌళి శాఖ కార్యాలయం ముందు కార్మికుల భారీ ధర్నా
పవర్లూమ్ కార్మికులు ఆసాములు, వార్పిన్, వైపని కార్మికులు పాలిస్టర్ కూలి పెంచాలని యారం న్. సబ్సిడీ పింజర సబ్సిడీ అందించాలని, సిఐటియు ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా చేనేత జౌళి శాఖ కార్యాలయం ముందు సోమవారం ధర్నా చేశారు.
ఈ సందర్భంగా పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ముశం రమేష్ ఆసాముల సంఘం కార్యదర్శి చేరాల అశోక్ మాట్లాడుతూ.. వారం రోజుల నుండి కార్మికులు ఆసాములు కూలి పెంచాలని, నిరవధిక సమ్మె చేస్తా ఉంటే ఇప్పటి వరకు యజమానులు కూలి పెంచడానికి ముందుకు రాకపోవడం దుర్మార్గమైన చర్య అని, గత ఐదు సంవత్సరాల నుండి కూలి పెంచకుండా కార్మికుల శ్రమ దోపిడీ చేయడం సిగ్గుచేటు అని అన్నారు.
15 వేల మంది పవర్లూమ్ కార్మికులు ఆసాములు గత వారం రోజుల నుండి సమ్మె చేస్తున్న కలెక్టర్, మంత్రి కేటీఆర్ పట్టించుకోకపోవడం సరైన పద్ధతి కాదని వారన్నారు. ఈ విషయంపై మంత్రి కేటీఆర్ తక్షణమే స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని రేపటి వరకు సమస్య పరిష్కరించకుంటే బుధవారం రోజున కలెక్టరేట్ పాదయాత్ర ముట్టడి చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు.
గురువారం అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా కార్యక్రమం, శుక్రవారం సిరిసిల్ల బందు లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తాము పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆ సాముల సంఘం నాయకులు సిరిసిల్ల రవీందర్, కొండ సుభాష్, రాజేశం, వార్పిన్ సంఘం అధ్యక్షులు సిరిమల్ల సత్యం, ఉడుత రవి, మచ్చ వేణు, వైపని కార్మిక సంఘం అధ్యక్షులు కుమ్మరి, కుంట కిషన్, జగదీష్, ఆడెపుసంపత్, గుండు రమేష్, సబ్బని చంద్రకాంత్, గడ్డంఆయిలయ్య పాల్గొన్నారు.