పోలీస్ కమిషనర్ ఏలెవన్ జట్టు విజయం
కరీంనగర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో మంగళవారం మీడియా లయన్స్ పోలీస్ కమిషనర్ జట్ల మధ్య జరిగిన స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్ లో కమిషనర్ ఎలెవన్ జట్టు పది వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన మీడియా లయన్స్ జట్టు నిర్ణీత 15 ఓవర్ల మ్యాచ్ లో 14 ఓవర్లలోనే 83 పరుగులు సాధించి ఆలౌట్ అయ్యింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన కమిషనర్ ఏలెవన్ జట్టు కేవలం 6. 2 ఓవర్లలోనే 84 పరుగులు సాధించింది. ఓపెనింగ్ బ్యాటింగ్ కు దిగిన ఫింగర్ ప్రింట్స్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ 23 బంతుల్లో ఒక సిక్స్, 8 ఫోర్లతో 43 పరుగులు సాధించడంతోపాటు ఒక ఓవర్లో రెండు పరుగులు ఇచ్చి రెండు వికెట్లను పడగొట్టారు. మరో ఓపెనర్ సాగర్ 15 బంతుల్లో 4 ఫోర్ల సహాయంతో 23 పరుగులు సాధించారు. అడ్మిన్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ 4 వికెట్లను పడగొట్టారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఫింగర్ ప్రింట్స్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ నిలిచారు.