మహనీయుల జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకుందాం : మంత్రి గంగుల

0 915

మహనీయుల జీవిత చరిత్రలను భావితరాలకు తెలియజేద్దాం

రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్

ఉత్సవాలను పండుగలా జరుపుకునేందుకు అందరూ సహకరించాలి.

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకుందా మని, ఉత్సవాలను పండుగలా జరుపుకునేందుకు సంఘాలన్నీ సహకరించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాల నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులు, అంబేద్కర్ సంఘాల, దళిత సంఘాల నాయకులతో ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ ఏప్రిల్ నెల 5వ తేదీన మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి, 14వ తేదీన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుటకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ దళితుల అభ్యున్నతి కోసమే కాకుండా , వారు అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం పని చేసిన మహనీయులని కొనియాడారు.

రాజ్యాంగం కల్పించిన హక్కు వల్లనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని గుర్తుచేశారు. భావితరాలకు ఈ మహనీయుల జీవిత చరిత్ర తెలియజేయాల్సిన అవసరం ఉందని అన్నారు. వారు చూపిన దారి మన అందరికీ అనుసరణీయమని తెలిపారు. దళితులకు జరిగే అన్యాయం పై మాత్రమే చర్చ జరగాలన్నారు. దళితుల సమస్యల పరిష్కారానికి ఉత్సవాల వేదిక వద్ద గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రీవెన్స్ సెల్ లో ఇచ్చిన దరఖాస్తుదారుల సమస్యలను అధికారులు పరిష్కరిస్తారని పేర్కొన్నారు. అంబేద్కర్ భవన్ కోసం నిధులు ఇచ్చామని, ఇంతవరకు కాంట్రాక్టర్ పని పూర్తి చేయలేదని, అంబేద్కర్ భవన్ పనులు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కలెక్టర్ కు సూచించారు. ఎండల తీవ్రత పెరుగుతున్నందున ఉత్సవాలను ఉదయమే ప్రారంభించు కోవాలని అన్నారు. ఉత్సవ వేదికల వద్ద షామియానాలు, తాగునీరు, సరిపడా కూలర్ల ను ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

శాంతియుత వాతావరణంలో ఉత్సవాలు సజావుగా జరిగేలా చూడాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలకు తన సొంత డబ్బులతో ఉచితంగా కోచింగ్ ఇప్పిస్తానని మెటీరియల్ ఉచితంగా అందజేస్తానని మంత్రి ప్రకటించారు. దళిత బంధు నిరంతర ప్రక్రియ అని, దళితులు అందరికీ పథకం అందుతుందని, ఎవరు కూడా నిరాశ చెందవద్దని మంత్రి తెలిపారు. జగ్జీవన్ రామ్ జయంతి, అంబేద్కర్ జయంతి ఉత్సవాలలో దళిత బంధు పథకం లబ్ధిదారులకు యూనిట్లను అందజేస్తామని అన్నారు. అనంతరము ఉత్సవాల నిర్వహణ పై దళిత సంగాల నాయకులు, అంబేద్కర్ సంఘాల నాయకులు చేసిన సూచనలను మంత్రి స్వీకరించారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు గరిమ అగ్రవాల్, శ్యామ్ ప్రసాద్ లాల్, ఆసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ మిత్తల్, ఆర్డిఓ ఆనంద్ కుమార్, అదనపు డిసిపి శ్రీనివాస్, ఏ సి పి శ్రీనివాస రావు, ఎస్ సి అభివృద్ధి శాఖ అధికారి నతానియేలు, వివిధ శాఖల అధికారులు, అంబేద్కర్ సంఘాల నాయకులు, దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents