సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి కొప్పుల

0 1,305

జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం పెగడపల్లి మండలంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 30 మంది లబ్ధిదారులకు రూ. 12, 32, 000 లక్షల రూపాయల చెక్కులు, అలాగే వెల్గటూర్ మండలం 30 మంది లబ్ధిదారుల కు 14, 28, 000 లక్షల రూపాయల చెక్కులను మొత్తం 60 మంది లబ్ధిదారులకు 26, 60, 000 లక్షల విలువగల చెక్కులను సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… అనేకమంది పేద ప్రజలు డబ్బులు లేక ఆస్పత్రుల్లో ప్రాణాలు కోల్పోవడం జరుగుతుందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం వారిని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి సహాయ నిధి క్రింద పేద ప్రజల ప్రాణాలను రక్షిస్తుందన్నారు. ధర్మపురి నియోజకవర్గంలో ఎంతో మంది పేద, మధ్య తరగతి ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి వరంగా మారిందని ఆయన అన్నారు.

సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి కొప్పుల

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents