కోలేటి’కి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా మరో రెండేళ్లు పోడిగింపు
తెలంగాణ రాష్ట్ర, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా గత ఐదు సంవత్సరాల కాలాన్ని విజయవంతంగా నిర్వహించి పదవికే వన్నె తెచ్చిన నాయకుడిగా కోలేటి దామోదర్ గుర్తింపు తెచ్చుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ మరో రెండు సంవత్సరాలు పోడిగిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. నాపై నమ్మకంతో మరోక సారి అవకాశం కల్పించినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి కోలేటి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.