రాజన్న ఆలయంలో భక్తుల సందడి
హరిహర క్షేత్రంగా, దక్షిణకాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి శుక్రవారం సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో సందడిగా మారాయి. ధర్మ దర్శనంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఉన్నతాధికారులు పర్యవేక్షించారు. స్వామి వారికి ఇష్టమైన కోడె మొక్కులతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకున్నారు.