అసదుద్దీన్ కు చేదు అనుభవం

0 18,489

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీకి గుజరాత్ లో చేదు అనుభవం ఎదురైంది. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ కు నేడు ఓవైసీ చేరుకున్నారు. అక్కడ ఆయన కాన్వాయ్ ని ముస్లింలు అడ్డుకున్నారు. నల్లజెండాలు చూపిస్తూ గోబ్యాక్ అంటూ నిరసన తెలిపారు. బీజేపీతో కుమ్మక్కు రాజకీయాలు ఓవైసీ చేస్తున్నారని వారు ఆరోపించారు. ఆ తర్వాత పోలీసులు, ఎంఐఎం కార్యకర్తల సాయంతో ఆయన ముందుకు కదిలారు. డిసెంబర్ లో గుజరాత్ లో ఎన్నికలు జరగనున్నాయి. అందులో భాగంగా పార్టీ నాయకులతో చర్చించేందుకు గుజరాత్ కు ఓవైసీ వచ్చారు.

అసదుద్దీన్ కు చేదు అనుభవం

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents