OMG:పెళ్లై..ఓ బిడ్డకు తల్లైనా వదల్లేదు..ఆమెను నైట్ కలిసినప్పుడు జరిగింది ఇదే వీడియో చూడండి

0 75,513

9సంత్సరాల క్రితమే వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. ఇంట్లో వాళ్లు అమ్మాయికి నచ్చకపోవడంతో వేరే యువకుడితో పెళ్లి చేశారు. అది జరిగి కూడా దాదాపు ఐదేళ్లు కావస్తోంది. ఆ వివాహిత ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఇంత జరిగినప్పటికి ఆ యువతి, యువకుడు ప్రేమించుకోవడం మానలేదు. వీలున్నప్పుడల్లా శారీరకంగా కలుస్తూనే ఉన్నారు. మమ్మల్ని ఎవరూ విడదీయలేరనే స్థాయిలోరెచ్చిపోయారు. ఫైనల్‌గా ఆ ప్రేమజంట గత రాత్రి సీక్రెట్‌గా కలుసుకున్న టైమ్‌లో ఊరి జనం కళ్లలో పడ్డారు. అంతే సీన్‌ మొత్తం రివర్స్ అయింది. బీహార్‌లో గ్రామస్తులు చేసిన పని సోషల్ మీడియా(Social media)లో తెగ వైరల్ అవుతోంది. జాముయ్(Jamui)జిల్లా చకై పోలీస్‌ స్టేషన్‌(Chakai Police Station)పరిధిలో ఉన్న సరౌన్‌ సంగుటోల్ (Surroun Sangutol)గ్రామంలో అర్ధరాత్రి వేళ ఓ యువకుడు ఎవరికి తెలియకుండా ఓ వివాహితను కలుసుకున్నాడు. ఇద్దరూ సీక్రెట్‌గా ముద్దు,ముచ్చట్లు చెప్పుకుంటున్న సమయంలో గ్రామానికి చెందిన కొందరు ఈ సీక్రెట్‌ లవర్స్‌ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏంటీ కథ, ఎందుకు కలిశారని నిలదీస్తే ఫ్లాష్ బ్యాక్ చెప్పారు. గ్రామస్తులకు పట్టుబడిన వివాహిత పేరు కాంచన్‌దేవి(Kanchan Devi), యువకుడి పేరు ముఖేష్‌దాస్(Mukesh Das). ఇద్దరూ 2013వ సంతవ్సరం నుంచి ప్రేమించుకుంటున్నారు. మొదట్లోనే వీళ్లిద్దరికి పెళ్లి చేయడం ఇష్టం లేని యువతి కుటుంబ సభ్యులు 2018లో జార్ఖండ్‌Jharkhandలోని గిరిదిహ్ (Giridih)జిల్లాకు చెందిన కామ్‌దేవ్ దాస్‌(Kamdev Das)తో పెళ్లి జరిపించారు. సదరు మహిళకు ఇష్టం లేని పెళ్లైతే చేశారు కాని..ఆమె మనసులో ఉన్న ప్రియుడ్ని మాత్రం దూరం చేయలేకపోయారు. దాంతో కాంచన్‌దేవికి పెళ్లి జరిగిన తర్వాత కూడా ఆమె ప్రియుడు ముఖేష్‌దాస్ వీలు కుదిరినప్పుడల్లా ఆమెను కలుస్తూ ఉండేవాడు. దీనికి తోడు కంచన్‌దేవి భర్త కామ్‌దేవ్ దాస్‌ సూరత్‌లో కూలీ పని చేస్తుండటంతో వీళ్లిద్దరూ తరచుగా కలుసుకోవడానికి, మాట్లాడుకోవడం, ముద్దు, ముచ్చట్లు ఆడుకోవడానికి ఈజీగా ఉండేది. అందుకే కాంచన్‌దేవి ఓ బిడ్డకు తల్లి అయినప్పటికి ముఖేష్‌దాస్ ఆమె మర్చిపోలేక..అర్ధరాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత వచ్చి కలుస్తూ ఉండేవాడు.

OMG:పెళ్లై..ఓ బిడ్డకు తల్లైనా వదల్లేదు..ఆమెను నైట్ కలిసినప్పుడు జరిగింది ఇదే వీడియో చూడండి

Also Read :

సీక్రెట్‌ లవర్స్‌కి పబ్లిక్‌గా పెళ్లి..

ప్రియురాలిని ఎప్పుడు కలిస్తున్నట్లుగా కలిసేందుకు సోమవారం ఆదివారం రాత్రి ఆమె ఉంటున్న సరౌన్ సంగుటోల్ గ్రామానికి వచ్చాడు. రాత్రి కావడంతో ఇద్దరూ కలిసి రహస్యంగా మాట్లాడుకుంటున్న సమయంలో గ్రామస్తులు చూశారు. అంతే ఇద్దర్ని పట్టుకొని గట్టిగా నిలదీయడంతో తాము ప్రేమించుకున్నామని..అందుకే కలుస్తున్నామని చెప్పడంతో గ్రామస్తులు వెంటనే యువకుడితో వివాహితకు ఆమె అత్తమామలు, గ్రామస్తుల సమక్షంలోనే యువకుడితో పెళ్లి చేశారు. పెళ్లి చేసే ముందు కూడా ఒకరంటే మరొకరికి ఇష్టమేనా అని అడగడటంతో యువకుడు ఇష్టం కాబట్టే వదిలి ఉండలేక ఇలా కలుస్తున్నామని చెప్పడంతో అతనితో వారి సంప్రదాయ ప్రకారం ఆర్ధరాత్రి గ్రామంలో పెళ్లి చేశారు. గ్రామానికి చెందిన కొందరు యువకులు ఈ వెరైటీ వెడ్డింగ్‌ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది.

గురుడు అడ్డంగా బుక్కయ్యాడు..

కాంచన్‌దేవికి పుట్టిన బిడ్డ పోలికల విషయంలో కూడా అత్తమామలు తరచూ గొడవపడే వాళ్లు. అలాగే ఆమె ఫోన్లు మాట్లాడటం, తరచూ ప్రియుడు ముఖేష్‌దాస్‌ సీక్రెట్‌గా కలుస్తుండటంతో ఆమెపై అనుమానం పెంచుకున్నారు. అందులో భాగంగానే ఆదివారం ఆమెపై నిఘా పెట్టి నచ్చిన ప్రియుడికి ఇచ్చి పెళ్లి చేశారు. 9ఏళ్ల క్రితం ప్రేమించుకున్న జంటకు వేరే వ్యక్తితో పెళ్లి జరిగిన తర్వాత కుటుంబ సభ్యులే ప్రేమించిన వాడితో పెళ్లి జరిపించిన వార్త స్థానికంగా కలకలం రేపింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents