ఉద్యమ సమయంలో కేసీఆర్ ప్రవర్తన వేరుగా ఉండేది.. సీఎం అయ్యాక పూర్తిగా మారిపోయారు.. ఈటల రాజేందర్ ధ్వజం
మెదక్లో (Medak) ఓ తల్లి, కొడుకు సజీవ దహనమయ్యారు (Mother and son suicide). వాళ్లిద్దరి చావుకు పరోక్షంగా రాజకీయశక్తులు, అధికారులేనని చనిపోయే ముందు తమ మరణ వాంగ్మూలాన్ని సెల్ఫీ వీడియో (Selfie video) రూపంలో చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ వార్తే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీంతో తల్లీకొడుకు ఆత్మహత్యకు కారణమైన టీఆర్ఎస్ నాయకులను వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్ (BJP MLA Eatala rajender), రఘునందన్ రావు (raghunandan rao)లు ఆత్మహత్య చేసుకున్న పద్మ, గంగం సంతోష్ కుటుంబాన్ని పరామర్శించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మట్లాడుతూ.. సీఎం కేసీఆర్ (CM KCR)ను ఒకప్పుడు తెలంగాణ గాంధీ అన్నవారే ఇప్పుడు తెలంగాణ (Telangana) ద్రోహి అంటున్నారని తెలిపారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ ప్రవర్తన (Behavior) వేరుగా వుండేదని.. సీఎం అయ్యాక పూర్తిగా మారిపోయిందన్నారు (Changed). ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఈయనా మా సీఎం.. అంటూ నీచంగా చూస్తున్నారన్నారు. చివరకు తూ అనే స్థాయికి సీఎం కేసీఆర్ (CM KCR) దిగజారిపోయారన్నారు. అంజయ్య సతీమణి పద్మ, కుమారుడు సంతోష్ వి ఆత్మహత్యలు కావని, ప్రభుత్వ హత్యలేనని ఈటల ఆరోపించారు. ప్రగతి భవన్లో కూర్చొని టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు మీరు ఏమన్నా చేసుకోండి.. మీపై ఎలాంటి కేసులు ఉండవు అని స్వయంగా సీఎం కేసీఆర్ చెప్పడమే దీనికి కారణమని ఈటల మండిపడ్డారు.
”పద్మ, సంతోష్ ఆత్మహత్యలపై సమగ్ర విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలి. స్వయంగా సీఐలే పోలీస్ స్టేషన్లో కూర్చొని ప్రజలను వేధిస్తుంటే ఎవరికీ చెప్పుకోవాలి. అలాంటి నీచులు పోలీస్ డ్రెస్ వేసుకోవడానికి అర్హులు కారు. తల్లీ కొడుకు ఆత్మహత్యకు కారణమైన అందరినీ హత్యానేరం కింద వెంటనే అరెస్ట్ చెయ్యాలి” అని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.
మీరు 30 ఏళ్లు విధుల్లో ఉంటారు కదా..
”రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్ష నాయకులపై రౌడీ షీట్లు ఓపెన్ చేసి.. ఆర్థిక దిగ్బంధం చేసి లొంగదీసుకుంటున్నారు. డీజీపీ గారు.. మీరు ఊర్లో పుట్టి పెరిగినవారు. తెలంగాణ ప్రజలు ఎలా ఉంటారో మీకు తెలుసు. సుదీర్ఘకాలం ఇంటెలిజెన్స్ లో పని చేశారు. అలాంటి మీరు ఐపిసి ప్రకారం పని చేస్తున్నారా? గులాం గిరీ చేస్తున్నారా? మీరు ఎందుకు ప్రజలను కాపాడలేకపోతున్నారు.
సీఎం ఉంటాడు పోతడు.. నాయకులు ఉంటరు పోతరు.. కానీ పోలీసులు 30, 40 ఏళ్లు విధులు నిర్వహించాలి. ఆత్మను చంపుకొని పని చేస్తే మిమ్ముల్ని చరిత్ర క్షమించదని హెచ్చరిస్తున్నా. ఇంటెలిజెన్స్ వ్యవస్థ దుర్మార్గాల మీద కన్ను వేయాలి.. సంఘ విద్రోహ శక్తుల మీద దృష్టి పెట్టాలి. కానీ మీరు ప్రతిపక్ష పార్టీల నాయకుల మీద, వారి సెల్ ఫోన్ ల మీద నిఘా పెట్టి వేధిస్తున్నారు.
ప్రజలకు జీతగాల్లు అని మర్చిపోకండి..
ఈటల మాట్లాడుతూ.. ”డీజీపీ కూడా ఒక్క నిమిషం కూడా ఆ కుర్చీలో కూర్చోవడానికి వేలు లేదు. ఆ కుర్చీ మీకు రాజ్యాంగ బద్దంగా వచ్చింది… అది మర్చిపోవద్దు. డీజీపీకి ఫోన్ చేస్తే అందుబాటులో ఉండరు.. డీఎస్పీలు మాట్లాడరు… ఏసీపీలు స్పందించరు. ఇంత బానిసలా? ప్రజల డబ్బులు చెల్లిస్తే వాటితో మీకు జీతాలు వస్తున్నాయి. ప్రజలకు జీతగాల్లు అని మర్చిపోకండి” అని హెచ్చరించారు.