ఓయూలో రాహుల్ గాంధీ పర్యటనకు వీసీ అనుమతి నిరాకరణ
హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్ గాంధీ పర్యటనకు ఓయూ వీసీ అనుమతిని నిరాకరించారు. రాజకీయ సభలకు అనుమతివ్వకూడదని పాలక మండలి నిర్ణయం తీసుకుందని ఓయూ వీసీ తెలిపారు. ఇతర సంఘాల నుంచి కూడా అభ్యంతరాలు ఉన్నాయని వీసీ అన్నారు. శాంతిభద్రతల దృష్ట్యా అనుమతి ఇవ్వడం లేదన్నారు.