మాజీ ఎంపీ వివేక్ ను విమర్శిస్తే ఖబడ్దార్
మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామిని విమర్శిస్తే ఖబడ్దార్ అని బీజేపీ నాయకులు హెచ్చరించారు. మంథనిలో పాత్రికేయుల సమక్షంలో ప్రెస్ క్లబ్ సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం బీజేపీ మండల అధ్యక్షుడు వేల్పుల రాజు మాట్లాడుతూ బీజేపీ పార్టీ అన్ని మతాలను, కులాలను గౌరవించే పార్టీ అన్నారు. టి. ఎస్ అంబేద్కర్ సంఘము రాష్ట్ర అధ్యక్షుడు గజ్జెల కాంతం మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ని విమర్శించే స్థాయి కాదన్నారు. మాజీ కేంద్ర మంత్రి వెంకటస్వామి దళితుల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారన్నారు. మాజీ ఎంపీ వివేక్ ను విమర్శిస్తే ఊరుకునేది లేదన్నారు. ఈ కార్యక్రమం లో ఓబీసీ మండల అధ్యక్షుడు అరే ఓదెలు, చిల్లపల్లి గ్రామశాఖ అధ్యక్షుడు కాశిపేట సంతోష్ కుమార్ పాల్గొన్నారు.