ప్రియుడితో భార్యను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త
ఆ దంపతులిద్దరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి. వారిద్దరిదీ ప్రేమ వివాహం. పెళ్లైన కొన్నాళ్లకు ఉద్యోగం రీత్యా వేర్వేరుగా ఉండాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ క్రమంలో ఆమె మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ వ్యవహారాన్ని ఆమె కుటుంబ సభ్యులకు భర్త చెప్పినా పట్టించుకోలేదు. చివరికి వారు విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన అతడు నిఘా వేశాడు. ప్రియుడితో భార్య ఉండగా వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ములుగు జిల్లాలోని దొడ్ల ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న చీమల సుమలత ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తోంది. ఆమెకు చర్ల కార్యదర్శి పాయం పురుషోత్తం పరిచయమయ్యాడు. కొన్నాళ్లకు వారిద్దరి మధ్య ప్రేమ చిగురించడంతో పెళ్లి చేసుకోవాలని భావించారు. ఇరువైపులా పెద్దలను ఒప్పించి, 8 ఏళ్ల క్రితం ఒక్కటయ్యారు. ఆ తర్వాత ఇద్దరూ ఉద్యోగాల కారణంగా వేరుగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలో ఆమెకు తన ఇంటర్ క్లాస్మేట్ లింగరాజు కనిపించాడు. అతడితో పెరిగిన సాన్నిహిత్యం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయమై పెద్దల్లో భర్త పంచాయతీ పెట్టించినా ఆమె మారలేదు. పైపెచ్చు ఆమె తల్లి పురుషోత్తాన్ని సవాల్ చేసింది. తమ కుమార్తెకు అలాంటి అలవాట్లు లేవని, దమ్ముంటే నిరూపించాలని ఛాలెంజ్ విసిరింది. దీంతో పట్టుదలతో అతడు నిఘా పెట్టాడు. ఓ ఇంట్లో లింగరాజు, సుమలత సన్నిహితంగా ఉండగా పట్టుకున్నాడు. సుమలత కుటుంబ సభ్యుల సమక్షంలో వారిని పోలీసులకు అప్పగించాడు.