ఓయూలో మరోసారి ఉద్రిక్తత
హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీలో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాహుల్ గాంధీ పర్యటనను వ్యతిరేకిస్తూ మంగళవారం టీఆర్ఎస్వీ ఆందోళన చేపట్టింది. టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. దీంతో పలువురు టీఆర్ఎస్వీ విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు.