ప్రెసిడెంట్ గా కేటీఆర్ కొడుకు హిమాన్షు!
హైదరాబాదులోని ఓక్రిడ్జ్ స్కూల్ స్టూడెంట్ కౌన్సిల్ ఎన్నికలు ఇటీవలె జరిగాయి. ఇందులో చదువుతున్నటువంటి కేసీఆర్ మనవడు హిమాన్షు ఈ ఎన్నికలలో విజయం సాధించాడు. హిమాన్షు ఈ ఎన్నికల్లో క్రియేటివ్ యాక్షన్ సర్వీస్ ప్రెసిడెంట్ గా పోటీ చేసి విజయం సాధించాడు.
ఓక్రిడ్జ్ యాజమాన్యం ఈ ఎన్నికల్లో నామినేషన్లు వేసిన వారిని తొలుత ఇంటర్వ్యూ చేసి అందులో కొందరిని మాత్రమే ఎంపిక చేసి ఓటింగ్ పెట్టింది. తుది జాబితాలో ఎంపికైన వారిలో హిమాన్షు కూడా చోటు దక్కించుకున్నాడు. కొన్నిరోజుల కిందట ఓటింగ్ ప్రక్రియ జరగ్గా, ఓట్లను లెక్కించిన ఓక్రిడ్జ్ స్కూలు యాజమాన్యం ఫలితాలను తెలియజేసింది. అందులో హిమాన్షు క్రియేటివ్ యాక్షర్ సర్వీస్ ప్రెసిడెంట్ గా విజయం సాధించారు.