ఎమ్మెల్సీ కవిత రేపు పర్యటన వివరాలు
ఎమ్మెల్సీ కవిత శనివారం జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు వెంకట్ రెడ్డి గార్డెన్స్ లో మెట్పల్లి, కోరుట్ల నియోజకవర్గం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. ఉదయం 11: 30 గంటలకు చల్గల్ మార్కెట్ యార్డ్ లో పర్యటిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12: 30 గంటలకు కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుని హనుమాన్ చాలీసా పారాయణంలో పాల్గొంటారని స్థానిక నాయకులు తెలిపారు.