పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కు సన్మానం
ఇటీవల రాష్ట్ర పురపాలక శాఖ మాత్యులు కేటీఆర్ చేతుల మీదుగా కోరుట్ల మున్సిపాలిటీ కి శానిటేషన్ విభాగంలో ఉత్తమ అవార్డు వచ్చిన సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ఎండి ఆయాజ్ ను, జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు రుద్ర శ్రీనివాస్ మున్సిపల్ లో ఘనంగా సన్మానించారు. కోరుట్ల మున్సిపల్ ను అభివృద్ధి పథంలో నడిపించేందుకు అధికారులు కృషి చేస్తున్నారని అని కొనియాడారు. కోరుట్ల మున్సిపల్ రాష్ట్రంలోనే ప్రత్యేకతను సంతరించుకుంది అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఎం బేరి భూషణ్, మాజీ కౌన్సిలర్ పోగుల లక్ష్మీరాజం, మున్నూరు కాపు సంఘం జిల్లా నాయకులు గడ్డం కిరణ్, తదితరులు పాల్గొన్నారు.