ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని చెవి కొరికేశారు!
మేజర్లు అయ్యాక ప్రేమించుకున్న కొందరి విషయంలో కుటుంబ పెద్దలు కఠినంగా వ్యవహరిస్తున్నారు. తమ అభీష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకుంటే ఆగ్రహంతో దాడులు చేస్తున్నారు. ఈ క్రమంలో తమ కుమార్తెను పెళ్లి చేసుకున్నాడనే కోపంతో యువకుడిపై అమ్మాయి తరుపు వారు దారుణంగా దాడి చేశారు. గొడవలో చెవి కొరికి, తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఏపీలోని ఏలూరు జిల్లా దెందులూరు మండలం చల్లచింతలపూడి గ్రామానికి చెందిన సాంబశివరావు అనే యువకుడు, పావని అనే యువతికి గతంలో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకు వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. వీరి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. దీంతో మూడు నెలల క్రితం ఈ జంట ఇంటి నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి పావని కుటుంబం వారు ఆగ్రహంతో ఉన్నారు. ఈ క్రమంలో సోమవారం ఈ జంట ద్వారకాతిరుమల మండలం ఎం.నాగులపల్లి శివార్లలోని ఓ రెస్టారెంట్లో ఉందని పావని కుటుంబం తెలుసుకుంది. పావని తండ్రి, తమ్ముడు అక్కడకు చేరుకుని సాంబశివరావుతో ఘర్షణ పడ్డారు. గొడవలో ఆగ్రహంతో సాంబశివరావు చెవిని వారు కొరికారు. కర్రలతో అతడిని బాగా కొట్టి గాయపరిచారు. దీంతో పావని, సాంబశివరావు మంగళవారం ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు