పాఠ్యపుస్తకాలు లేకుండా చదువులే..

ఏఐఎఫ్ బీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి

0 9

ప్రభుత్వ పాఠశాలల్లో పాఠ్య పుస్తకాలు లేకుండా విధ్యార్థుల చదువులు ఎలా సాగుతాయని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి ప్రశ్నించారు. మొన్న త్రిబుల్ ఐటీ.. నేడు ప్రభుత్వ పాఠశాలల సమస్యలు సర్కారు చిత్తశుద్దిని ప్రశ్నిస్తున్నాయన్నారు. ఈ మేరకు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కళాశాల విధ్యార్థులకు ఫీజు రీయంబర్స్ మెంట్ విడుదల చేయకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. కళాశాలల్లో ఫీజు రీయంబర్స్ మెంట్ విడుదల చేయకుండా సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, ఫలితంగా విధ్యార్థులు ఉన్నత విద్య, ఉద్యోగాలకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆర్బాటంగా ప్రకటించిన కేజీ టు పీజీని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడో మరిచిపోయారన్నారు. మన ఊరు మన బడి పేరిట చేపట్టిన కార్యక్రమాలు చేపట్టిన ప్రభుత్వం పాఠశాలల సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరిండంలో విఫలమయ్యిందన్నారు. విద్యాసంవత్సరం ప్రారంభమై పదిరోజులు గడిచిపోయినా సర్కారుకు చీమకుట్టినట్లయినా లేదన్నారు. పాఠ్య పుస్తకాలు, స్కూల్ యూనిఫాంలు ఇవ్వకుండా సర్కారు బళ్లను నడుపుతుండడం శోచనీయమన్నారు. తరగతి గదిలో ఉపాధ్యాయుల నిరంతర పర్యవేక్షణ, పరిశీలన, వ్యక్తిగత శ్రద్ధతోనే ప్రాథమిక తరగతుల విద్యార్థులకు అభ్యసనం కొనసాగుతుందన్నారు. వేసవి కాలంలోనే చేరాల్సిన పాఠ్యపుస్తకాల ఊసే లేకుండా పోయిందన్నారు. కానీ సకాలంలో పాఠ్యపుస్తకాలు సప్లై చేయకపోవడంతో విద్యార్థులు నిరుత్సాహానికి గురి అవుతున్నారన్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టినందున నూతనంగా ప్రభుత్వ పాఠశాలలలో అడ్మిషన్లు జరుగుతున్నాయన్నారు. అందుకు తగిన విధంగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చేరిన విద్యార్థులు పాఠ్యపుస్తకాలు లేక తిరిగి మళ్ళీ ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లేందుకు అవకాశం ఉన్నందున తక్షణమే పుస్తకాలు సప్లై చేయాలన్నారు. ప్రైవేట్ పాఠశాలలో పాఠ్యాంశాల బోధన ప్రారంభమైనది కానీ ప్రభుత్వ పాఠశాలలో అట్టి బోధన చేయడానికి పాఠ్యపుస్తకాలు ఇంకా సప్లై కాలేదని ,ఈ విషయం పట్ల ప్రభుత్వం దృష్టి సారించాలనీ కోరారు. విద్యాశాఖ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాఠ్యపుస్తకాలు సకాలంలో అందిస్తామని ప్రతి ఏటా చెపుతున్నా దానిని ఆచరణలో పెట్టడంలో మాత్రం విఫలమవుతోందన్నారు. అరకొరగా వచ్చిన పాఠ్యపుస్తకాలను అధికారులు పంపిణీ చేసి చేతులు దులుపుకుంటున్నారని పేర్కొన్నారు. తర్వాత మిగిలిన పుస్తకాల కోసం మాత్రం నిరీక్షణ తప్పడం లేదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, మరుగుదొడ్లు వెంటనే నిర్మించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో మినరల్ వాటర్ ను ఏర్పాటు చేయాలని వారన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మధ్యాహ్నం భోజనం మెస్ కాస్మొటిక్ ఛార్జీలు పెంచాలని వారన్నారు. అదేవిధంగా స్కూల్ లో మధ్యాహ్నం పౌష్టికాహారంతో కూడిన భోజనం విద్యార్థులకు అందించాలని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents