సాధారణ ప్రసవాల్లో కరీంనగర్ జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉండాలి
జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్
జిల్లాలో సి సెక్షన్ కాన్పులను తగ్గించి సాధారణ కాన్పులు చేసి కరీంనగర్ జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలపాలని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అన్నారు.
సీజనల్ వ్యాధుల పైన మరియు “ఏ- షీల్డ్” ఆప్ మీద ఒకరోజు శిక్షణా కార్యక్రమం
స్థానిక వి -కన్వెన్షన్ ఫంక్షన్ హాలులోఒక రోజు శిక్షణా కార్యక్రమముజిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలకు , ఏఎన్ఎం, ఆశ నోడల్ పర్సన్స్ , అంగన్వాడీ కార్యకర్తలకు సీజనల్ వ్యాధులు డెంగ్యూ ,మలేరియా ,చికెన్ గున్యా, ఫైలేరియా మరియు “ఏ- షీల్డ్” రక్తహీనత నివారణ , క్షయ వ్యాధి నివారణ పైన శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కరోన వ్యాక్సినేషన్ మొదటి మరియు రెండవ మోతాదులో 100% పూర్తి చేసి రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉన్నందుకు అభినందనలు తెలిపారు. వ్యాక్సినేషన్ తరహాలోనే “సి” సెక్షన్ కాన్పులు కూడా తగ్గించి సాధారణ కాన్పులలో కరీంనగర్ జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలపాలని అన్నారు.
సి -సెక్షన్ వల్ల జరిగే అనర్థాలను తెలియజేస్తూ సాధారణ కాన్పు చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రజల్లో విస్తృతంగా ప్రచారం కల్పించి సాధారణ కాన్పులు పెంచాలని అన్నారు.
అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్ మాట్లాడుతూ అందరూ “ఏ షీల్డ్” యాప్ ను డౌన్లోడ్ చేసుకొని ఆశా కార్యకర్తలు ఏఎన్ఎంలు 15 సంవత్సరములు పైబడిన మహిళలందరిని రోజుకు 20 టెస్టులు చేసి అందులో నమోదు చేసి ఒక నెల రోజుల లోపల అందరికీ అనిమియా టెస్టులు నిర్వహించాలని కోరడం జరిగింది.
జిల్లా మలేరియా స్టాప్ దోమలు పుట్టే స్థావరాలు మరియు వాటిని ఎలా నిర్మూలించాలి దానిపై ప్రదర్శన చేయడం జరిగినది. ఆశా కార్యకర్తలు అందరికీ హెచ్ బి టెస్ట్ కిట్ ఇవ్వడంతోపాటు గా దాన్ని ఎలా వినియోగించాలో పూర్తిగా ప్రదర్శన ఇవ్వడం జరిగినది. అనంతరం అన్ని ఆరోగ్య కార్యక్రమాలలో ఉత్తమ సేవలందించిన ఆశా కార్యకర్తలు , అంగన్వాడీ కార్యకర్తలు మరియు ఏఎన్ ఎం లకు ప్రశంసా పత్రం తో పాటుగా బహుమతులు కలెక్టర్ ప్రధానం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ కార్యనిర్వహణాధికారి ప్రియాంక, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ జువేరియా, జిల్లా సంక్షేమ అధికారి పద్మావతి, జిల్లా మలేరియా అధికారి డాక్టర్ రాజగోపాల్ రావు, జిల్లా క్షయ నివారణ అధికారి రవీందర్ రెడ్డి, జిల్లా ప్రోగ్రాం అధికారులు ,వైద్యాధికారులు, సి డి పి వో లు, ఏఎన్ఎంలు, ఆశా, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.