శ్రీ చైతన్య స్కూల్ ను మూసివేయాలి.
డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి.
నగరంలో శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం ఐఐటి జే ఈఈ మెయిన్స్ ఒలంపియాడ్ అనే రకరకాల తోక పేర్లు పెట్టి మరియు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలో విచ్చలవిడిగా బుక్కులు అమ్ముతూ విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్న శ్రీ చైతన్య స్కూల్ అను తక్షణమే మూసివేయాలని తిరుపతి డిమాండ్ చేశారు.
స్థానిక విద్యారణ్యపురి ఒలంపియాడ్ ఐపీఎల్ శ్రీ చైతన్య స్కూల్లో నిబంధనకు విరుద్ధంగా స్కూల్లో పుస్తకాలు అమ్ముతున్నారని సమాచారంతో తెలుసుకొని మండల విద్యాధికారి మధుసూధనాచారి సమక్షంలో స్కూల్లలో తనిఖీలు నిర్వహించగా నిబంధనకు విరుద్ధంగా ఐఐటి జేఈఈ మెయిన్స్ ఒలంపియాడ్ రకరకాల తోక పేర్లతో ఫ్లెక్సీలు పెట్టుకొని ప్రచార ఆర్భాటాలు చూసి తక్షణమే ఫ్లెక్సీలను తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు పుస్తకాల అమ్ముతున్న గదిని స్కూల్ యాజమాన్యం తాళం వేయడం తో తాళం తీయాలని ఆదేశించగా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించారని తిరుపతి అన్నారు. ఆగ్రహించిన మండల విద్యాధికారి తాళం తీయకపోవడంతో పుస్తకాలు అమ్మే రూమును సీల్ చేయడం జరిగిందని ఆయన అన్నారు. స్కూళ్లలో క్రీడా మైదానాలు ఏర్పాటు చేయకుండా డబ్బులు సంపాదించాలని ధ్యేయంగా ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ వేల సంఖ్యలో పుస్తకాల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుడు ప్రచారాలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్న శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం పై చర్యలు తీసుకొని పాఠశాలను మూసివేయాలని ఆయన డిమాండ్ చేశారు.ప్రభుత్వ నిబంధనల ప్రకారం శ్రీ చైతన్య హైస్కూల్ ఉండాలని నిబంధనలు చెబుతున్నాయి నిబంధనకు విరుద్ధంగా తోక పేర్లు పెట్టి మోసం చేస్తున్నారని ఆయన అన్నారు. శ్రీ చైతన్య స్కూల్ లపై చర్యలు తీసుకోకపోతే తమ సంఘం ఆధ్వర్యంలో మరింత ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని ఆయన అన్నారు. కార్యక్రమంలో నాయకులు గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు బోడ మోహన్ నాయక్ రవీందర్ శివరాజ్ తదితరులు పాల్గొన్నారు.