హారితహారం లో పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు చర్యలు

నగరంలో మరో 30 కోట్ల రూ. నిధులతో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు

0 4

నగరపాలక సంస్థ పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపడుతుందని నగర మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. కరీంనగర్లోని 17 డివిజన్ లో శుక్రవారం రోజున కమిషనర్ సేవా ఇస్లావత్ తో కలిసి నగర మేయర్ యాదగిరి సునీల్ రావు పర్యటించారు. స్థానిక కార్పొరేటర్ కోల భాగ్యలక్ష్మి ప్రశాంత్ తో కలిసి నగరపాలక సంస్థకు చెందిన 17 లక్షల నిధులతో డ్రైనేజీ అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. అనంతరం డివిజన్లోని రోడ్డు, డ్రైనేజీ సమస్యలను తనిఖీ చేసి పరిశీలించారు. చేపట్టిన డ్రైనేజీ పనులను నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్ ను ఆదేశించారు. ఈ సందర్భంగా సునీల్ రావు మాట్లాడుతూ… మంత్రి గంగుల కమలాకర్, ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ వినోద్ కుమార్ సహకారంతో నగరపాలక సంస్థ పరిధిలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. నగర పాలక సంస్థ అభివృద్ధి పనులను నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తుందని అన్నారు.

కరీంనగర్ నగర అభివృద్ధి ధ్యేయంగా నగరపాలక సంస్థ ముందుకు సాగుతుందని తెలిపారు. ఇందులో భాగంగా ఈరోజు 17 వ డివిజన్ హరిహర నగర్ కొత్త గాజువాక ప్రాంతంలో డ్రైనేజీ నిర్మాణం పనులకు భూమి పూజ చేశామన్నారు. 17 వ డివిజన్ శివారు ప్రాంతం కావడంతో గత కొంత కాలంగా అభివృద్ధికి దూరంగా ఉందన్నారు. మా నూతన పాలకవర్గంలో 17వ డివిజన్ కు ప్రత్యేక నిధులను కేటాయించి అభివృద్ధి పనులతో ప్రజలకు మౌలిక వసతులను కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. ఇప్పటికే డివిజన్లోని పలు ప్రాంతాల్లో చక్కటి డ్రైనేజి నిర్మాణం చేపట్టి సిసి రోడ్లు నిర్మించామన్నారు. సంబంధిత లింక్ అప్ సమస్యలను కూడా దశల వారీగా పరిష్కరిస్తుందని తెలిపారు. డివిజన్లో మట్టి రోడ్లు కనిపించకుండా సి సి రోడ్డు నిర్మాణం చేసి మిగిలిన డ్రైనేజీ పనులను త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. 17 వ డివిజన్ శివారు ప్రాంతం కావడంతో స్థానికంగా ప్రజలు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని… ప్రజల ఇబ్బందులను త్వరలోనే తొలగిస్తామని అన్నారు. 17, 18, 19 డివిజన్లలో మంత్రి గంగుల కమలాకర్ సహకారంతో పెద్ద ఎత్తున అభివృద్ధిపనులు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ఈనెల చివరి వారంలో 30 కోట్ల నిధులతో పెద్ద ఎత్తున నగరంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు టెండర్ ప్రక్రియ చేపట్ట పోతున్నామని తెలిపారు. శివారు ప్రాంతాల్లో డివిజన్లకు మంచినీటి సరఫరా విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించి మంచినీటి పైప్లైన్ పనులను పూర్తి చేసి ఇ త్వరలో త్రాగు నీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. నగర పాలక సంస్థలో కార్పోరేటర్లు అడిగిన డిమాండ్లను ప్రజల సమస్య గా భావించి వాటిని త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నగర ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని డివిజన్ల వారీగా ఓపెన్ జిమ్ లను ఏర్పాటు చేయడంతో పాటు పలు వాకింగ్ ట్రాక్ లను కూడా నిర్మాణం నగర ప్రజలకు ప్రత్యేకంగా నైట్ మార్కెట్లను ఏర్పాటు చేసేందుకు కూడా నగరపాలక సంస్థ చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. 17వ డివిజన్ పరిధిలోని శాతవాహన యూనివర్సిటీ రోడ్డులో నైట్ మార్కెట్ లో ఏర్పాటు చేసేందుకు స్థలం కూడా గుర్తించామన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా 17 వ డివిజన్ తో పాటు 18 19 డివిజన్ రేకుర్తి ప్రాంతంలో కూడా మినీ హైమాస్ట్ లైట్లు ఎల్ఈడీ లైట్లు కూడా ఏర్పాటు చేసి ప్రజలకు వెలుగు నగరపాలక సంస్థ పరిధిలో ఎక్కడ చూసినా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నగరపాలక సంస్థకు అందిస్తున్న నిధులతో పాటు వివిధ గ్రంథాలు రూపేనా వచ్చే నిధులతో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టి ప్రజలకు కావాల్సిన సదుపాయాలను కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. అంతేకాకుండా వచ్చే హరితహారం లో పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు ఏర్పాటు చేశామన్నారు. నగరంలో లో ఎక్కడ స్థలం ఉంటే అక్కడ అ మొక్కలు నాటేందుకు ప్రణాళికలు కూడా సిద్ధం చేశామన్నారు. వచ్చే విడత హరితహారం లో మొక్కలు నాటేందుకు ఇప్పటికే టెండర్ల ప్రక్రియను కూడా పూర్తి చేశామని స్పష్టం చేశారు. నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులను వచ్చే 9 మాసాల్లో గా అన్ని పనులను పూర్తిచేసే విధంగా నగరపాలక సంస్థ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. రాబోయే భావితరానికి కరీంనగర్ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్ది అన్ని రకాల వసతి సౌకర్యాలు కల్పించే విధంగా మా పాలకవర్గం పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో లో ఈఈ మహేందర్, ఏఈ చైతన్య, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.‌

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents