క్లాస్ టీచర్ గా .. మంత్రి
కొత్త సారు కాదు.. మన మంత్రి గంగుల కమలాకర్ గారట..!
తరగతి గదిలో విద్యార్థులకు శనివారం తెలంగాణ బిసి, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఉపాద్యాయుడి రూపంలో వచ్చారు. ఒక మంత్రి టీచర్‌గా రావడం, క్లాస్ రూంలో టీచర్‌గా విద్యార్థులకు డిజిటల్ క్లాస్ తీసుకోవడంతో ఆ పాఠశాలలో విద్యార్థులతో పాటు, ఉపాధ్యాయులు, అధికారులు అవాక్కు అయ్యారు. కరీంనగర్‌లోని కార్ఖానా గడ్డ ప్రభుత్వ పాఠశాలలో మంత్రి గంగుల కమలాకర్ పాఠాలు బోధంచారు. ప్రభుత్వ పాఠశాలల్లో టెక్నాలజీతో కూడిన విద్యను అందిస్తున్నామని అన్నారు. , విద్యార్థులు సృజనాత్మక శక్తిని పెంచడానికి ఈ క్లాస్ రూమ్ ల సౌకర్యం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. .
ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ ల్యాబ్ స్మార్ట్ క్లాస్ రూమ్ ఏర్పాటు, పదో తరగతి విద్యార్థిని విద్యార్థులకు టెక్నాలజీ విద్య, స్మార్ట్ క్లాస్ రూమ్,/ స్మార్ట్ ల్యాబ్, ఈ క్లాస్ రూమ్ ప్రాజెక్టు, గూగుల్ క్రోమ్ బుక్స్, యుపిఎస్ లు, స్టూడెంట్ డెస్కులు,ఇంటర్నెట్ సౌకర్యం కల్పించి… టెక్నాలజీతో కూడిన విద్య బోధన చేస్తామన్నారు. ఆధునిక టెక్నాలజీతో కూడిన విద్యా బోధన ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మక శక్తి పెరిగి నేర్చుకునే పాఠ్యాంశాలు సులభతరం అవుతాయన్నారు. టెక్నికల్ విద్యా విధానంలో ప్రత్యేకంగా ఆడియో, వీడియో పద్ధతిలో పాఠాలు చెప్పారు. ఇలాంటి విద్యా విధానం తో విద్యార్థిని విద్యార్థుల్లో అభ్యసనం పట్ల ఆసక్తి పెరుగుతుందని స్పష్టం చేశారు. అయితే మంత్రి తరగతి గదిలో బోర్డుపై రాజుకుంటూ పాఠాలు చెబుతుంటే ఎవరో కొతంత సారు వచ్చినారేమోనని విద్యార్థులు అనుకున్నారు. చదువు, పాఠం చెప్పంది కొత్త సారు కాదు. మంత్రి గంగుల కమలాకర్ అని తెలుసుకుని ఆ స్కూలు విద్యార్థులు అవాక్కు అయ్యారు. మంత్రి గంగుల కమలాకర్ క్లాస్ రూంలో విద్యార్థులకు పాఠాలు బోధిస్తుంటే.. పక్కనే ఉన్న నగర మేయర్ సునీల్ రావు, కలెక్టర్ ఆర్ వి కర్ణన్, సుడా చైర్మన్ జీ.వి రామకృష్ణారావు, లోకల్ బాడీ అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, కమిషనర్ సేవ ఇస్లావత్,డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి హరిశంకర్, పలువురు కార్పొరేటర్లు, జిల్లా విద్యాశాఖ అధికారి, సిహెచ్ వి ఎస్ జనార్దన్ రావు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అందరూ అశ్చర్యపోయారు. మంత్రి కమలాకరన్న గింత మంచిగా చదువు చెబుతున్నారని ముచ్చటపడ్డారు.