రంగాపూర్ లో ర‌ణ‌ రంగం

-ప్ర‌జాకోర్టును అడ్డ‌కునే య‌త్నం..

0 14

రంగాపూర్ లో ర‌ణ‌ రంగం
-ప్ర‌జాకోర్టును అడ్డ‌కునే య‌త్నం..
-దాడి వెనుక ఎవ‌రున్నా..తాట తీస్తా..
-రిటైడ్ సిఐ దాస‌రి భూమ‌య్య హెచ్చ‌రిక‌
-నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా ద‌లితుల భూముల‌ను ప‌ట్టా చేసిన ఎంఆర్వో
-ఎస్సీ,ఎస్టీ యాక్టు4 కింద ఎంఆర్వో పై కేసు న‌మోదు చేయాల‌ని డిమాండ్‌

పెద్ద‌ప‌ల్లి జిల్లా రంగాపూర్ గ్రామంలో రిటైడ్ సిఐ దాస‌రి భూమ‌య్య ఆదివారం ఏర్పాటు చేసిన ప్ర‌జాకోర్టుకు ప్ర‌జ‌ల నుండి విశేష స్పంద‌న ల‌భించింది. ప్ర‌జాకోర్టులో పేద‌ల భూముల‌ను లాక్కుంటున్నార‌నే స‌మాచ‌రంతో గ్రామ‌స్తులు, ప్ర‌జ‌ల‌కు అండ‌గా దాస‌రి భూమ‌య్య నిలిచారు. రంగాపూర్‌లో దాస‌రి భూమ‌య్య ప్ర‌జ‌ల స‌మ‌క్షంలో ఏర్పాటు చేసిన ప్ర‌జాకోర్టును పెడితే కొంద‌రు అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఈ గొడువ వెనుక ఏ స్థాయి నాయ‌కుడున్నా.. వాడి తాట తీస్తాన‌ని రిటైడ్ సిఐ దాస‌రి భూమ‌య్య హెచ్చ‌రించారు.

రంగాపూర్‌లో గ‌తంలో పేద‌ల‌కు పంపిణి చేసిన 7.30 ఎక‌రాల‌లో ఒక‌రిద్ద‌రు అందులో ఒక‌రిద్ద‌రూ భూక‌జ్జా య‌త్నానికి పాల్ప‌డుతున్నార‌నే స‌మాచారంతో ఆదివారం రిటైడ్ సిఐ భూమ‌య్య ప్ర‌జ‌ల మ‌మేకంతో గ్రామ చావ‌డి వ‌ద్ద ప్ర‌జాకోర్టు పెట్టి ప్ర‌జ‌ల‌తో మాట్లాడుతున్నారు. అదే స‌మ‌యంలో కొదంరు క‌ల‌గ‌జేసుకుని గొడువ సృష్టించారు. ఈ విష‌యంలో ప్ర‌జ‌లు ఆగ్ర‌హాం వ్య‌క్తం చేశారు. మూకుమ్మ‌డిగా అల్ల‌రి మూక‌ల‌పై ఎదురు దాడి తిరిగి దాడి చేశారు. చెప్పుల‌తో కొట్టారు. ఇంత‌టితో ఆగ కుండా నిరుపేద‌ల‌ ఇళ్ల‌ను లాక్కుంటున్నార‌ని పెద్ద‌ప‌ల్లి క‌లెక్ట‌ర్ కు రంగాపూర్ గ్రామ‌స్తులు ఫిర్యాదు చేశారు. ఈ సంద‌ర్బంగా ప్ర‌జాకోర్టులో రిటైడ్ సిఐ దాస‌రి భూమ‌య్య మాట్లాడుతూ గ‌తంలో 22 సంవ‌త్స‌రాల క్రితం గ్రామంలో నిరు పేద‌ల‌కు ఇళ్ల స్థ‌లాలు ప్ర‌భుత్వం ఇవ్వ‌డం జ‌రిగింది. అయితే ఇట్టి భూమిలో 2 ఎక‌రాలను కొంద‌రు క‌బ్జా చేసుకుని అక్ర‌మంగా కోర్టును త‌ప్పుదారి ప‌ట్టించి రిజిస్టేష‌న్ చేసుకున్నార‌ని, వారిపై చ‌ట్టరిత్యా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. ఈ విష‌యంలో ఒక ఎంఆర్వో లాలూచికి దిగ‌జారి ద‌ళితుల ఇళ్ల స్థలాల‌ను ఇత‌రుల‌కు ప‌ట్టా చేయ‌డంపై ఆగ్ర‌హాం వ్య‌క్తం చేశారు. వెంట‌నే స‌ద‌రు ఎంఆర్వోపై చ‌ర్య‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని స్థానిక ఎమ్మెల్యే, క‌లెక్ట‌ర్ల‌ను కోరారు. ద‌ళితుల భూముల‌ను ధార‌ద‌త్తం చేసిన ఎంఆర్వోపై ఎస్సీఎస్టీ యాకు్ట కేసు న‌మోదు చేయాల‌ని డిమాండ్ చేశారు. ప్ర‌జ‌ల‌కు న్యాయం జ‌రిగే వ‌ర‌కూ న్యాయ పోరాటం చేస్తామ‌ని హెచ్చ‌రించారు. అల్ల‌రి చేసే చిల్ల‌ర నా కొడుకుల‌కు ఎవ‌రూ భ‌య‌ప‌డ‌వ‌ద్ద‌ని ప్ర‌జ‌ల‌కు అభ‌యం ఇచ్చారు. దీని వెనుక ఎవ‌రూ ఉన్నారో, తెలుసున‌ని, ఎవ‌రు వెనుక ఉండి న‌డిపిస్తున్నారో తెలుసున‌ని ప్ర‌జ‌లే వారి తాట తీయ‌డం ఖాయ‌మ‌ని హెచ్చ‌రించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents