రాజీ మార్గమే రాజమార్గం
మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి భవాని చంద్ర
కేసుల సత్వర పరిష్కారం కోసమే లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి భవాని చంద్ర అన్నారు.
జిల్లా న్యాయ సేవా సదన్ భవనములో జిల్లా ప్రధాన న్యాయస్థానంలో జాతీయ లోక్ అదాలత్ న్యాయమూర్తి భవాని కేంద్ర నిర్వహించారు.ఆదివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సివిల్, క్రిమినల్, మరియు ఫ్రీ లిటిగేషన్ కేసులు పరిష్కారం అయినట్టు జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రెటరీ సుజయ్ మరియు తెలిపారు. ఆదివారం ఉదయం జిల్లా న్యాయ సేవా సదన్ భవనంలో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి భవాని చంద్ర ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ కేసుల సత్వర పరిష్కారం కోసం లోక్ అదాలత్ లు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు, లోక్ అదాలత్ నిర్వహించడంలో కేసు లో ఒకరు గెలవడం మరొకరు ఓడిపోవడం జరగదని ఇరు పార్టీలు గెలుపును పొందవచ్చని, జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు వినియోగించుకునే విధంగా ప్రకటనలు మరియు అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని, కక్షిదారులు రాజీ కూర్చుని తమ కేసులను పరిష్కరించేందుకునే విధంగా శాశ్వత లోకదాలత్ అందుబాటులో ఉంటుందని, ఈసారి పోలీసు శాఖ సహకారంతో చాలా వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పరిష్కారమయ్యాయి దీనికోసం న్యాయస్థానంలో అదనంగా సిబ్బందిని కేటాయించామని, రాజీ మార్గామే రాజమార్గం అనే నినాదంతో రాజీ మార్గంలో కేసులను పరిష్కరించుకోవాలని కక్షిదారులకు కోరారు ఇట్టి తగాదాలు రాజీ మార్గంలో కేసులను పరిష్కరించుకుంటే కక్షిదారులకు కోర్టు ఫీజు కూడా తిరిగి ఇవ్వబడుతుందని తెలిపారు
ఈ కార్యక్రమంలో ఐదవ అదనపు జిల్లా న్యాయమూర్తి శ్రీ వాణి, అదనపు జిల్లా న్యాయమూర్తి కుమార్ వివేక్ న్యాయమూర్తులు శ్రీనిజ, అర్పిత మారంరెడ్డి, సరళ రేఖ, హేమలత, అడిషనల్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్, అదనపు పోలీసు కమిషనర్ చంద్రమోహన్, బార్ అసోసియేషన్ అధ్యక్షలు ఎర్రం రాజిరెడ్డి, న్యాయ సేవా అధికార సంస్థ ప్యానెల్ న్యాయవాదులు, ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు, బ్యాంకుల ప్రతినిధులు, న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు శనివారం సాయంత్రం వరకు జరిగిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లాలో కోర్టుల్లో ని సివిల్, క్రిమినల్ మరియు ఫ్రీ లిటిగేషన్ కేసులు పరిష్కారం అయినట్టు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి సుజయ్ గారు తెలిపారు