ప్రజాకోర్టు వాయిదా
రిటైడ్ సిఐ దాసరి భూమయ్య
జులై1 నుండి కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ప్రారంభం కానున్న ప్రజాకోర్టు సభలు, సమావేశాలు అనివార్య కారణాల దృష్ట్యా తాత్కాలికంగా వాయిదా వేసినట్లు రిటైడ్ సిఐ దాసరి భూమయ్య ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలు నేరుగా ప్రజల్లోకి చేరడం లేదని, సంక్షేమ పథకాలు ప్రజలకు అందడంలో మధ్య దళారులు ఎక్కువై పోయారని,కొందరు ప్రభుత్వ అధికారులు, పాలకులు అవినీతికి,నిర్లక్ష్యానికి పాల్పడుతున్న నేపధ్యంలో అధికారులు, పాలకుల నిర్లక్ష్యాన్ని ఎండ గట్టేందుకు జులై1 నుండి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రతి మండల కేంద్రంలో ప్రజాకోర్టులు పెడుతానని ప్రెస్ మీట్ ద్వారా ప్రకటించిన కీలక నిర్ణయం తెలిసిందే. ప్రజాకోర్టులో ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చిన విషయాలను సీఎం కు, ప్రభుత్వానికి ఒక నివేధిక రూపంలో పంపుతానని ప్రకటించడం జరిగింది. క్షేత్ర స్థాయిలో అసలు ఏం జరుగుతుందో కెసిఆర్, కెటిఆర్ లకు తెలియజేయాలనే సంకల్పంతో ఈ ప్రజాకోర్టు కార్యక్రమాన్ని తాను తీసుకున్నాను.
గొర్రెల పథకం. బర్రెల పథకం, కళ్యాణ లక్ష్మీ, సాధీ ముభారక్ లాంటి ఎన్నో వివిధ సంక్షేమ పథకాలలో కొందరు అవినతికి పాల్పడి అందినంత దంటుకుంటున్నారనే తన దృష్టికి వచ్చిందన్నారు. అలాగే అక్రమ బూదందాలు, ల్యాండ్ మాఫియాలు, సెటిల్‌మెంట్స్, అక్రమ ఇసుక రవాణా, బెల్ట్ ఫాపులు, ఇలా అనే అంశాలలపై ప్రజాకోర్టులో ప్రజలతో సుదీర్గంగా చర్చించి నివిధికను ప్రభుత్వానికి పంపించాలని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల తాత్కాలికంగా జూలై1 నుండి ప్రారంభం కానున్న ఈ ప్రజాకోర్టు కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు ప్రకటించడం జరిగిందని దాసరి భూమయ్య తెలిపారు.