దళితులు ఉన్నత వర్గాలకు ధీటుగా ఎదిగేందుకే దళితబంధు

-రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్

0 4

దళిత బంధు పథకంతో భవిష్యత్ తరాలు ఉన్నత వర్గాలకు ధీటుగా ఎదుగుతారని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, జిల్లా పరిషత్ చైర్మన్ కనుమల్ల విజయ, సుడా చైర్మన్ తో కలసి దళిత బంధు, డబుల్ బెడ్ రూమ్, మిషన్ భగీరథ కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకం ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. బ్యాంకు లింకేజీ లేకుండా, మార్టిగేజ్ లేకుండా, తిరిగి చెల్లింపులు లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో రూ 10 లక్షలు అందించి దళితులు తమ కాళ్ళపై తాము నిలబడేలా ఆర్థికంగా ఎదిగేందుకు దళిత బంధు పథకం ప్రవేశపెట్టినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కి మంత్రి అభినందనలు తెలిపారు. దళిత బంధు పథకంతో భవిష్యత్ తరాలు ఉన్నత వర్గాలకు ధీటుగా ఎదుగుతారని అన్నారు. దళిత బంధు పథకంతో దళితులు వాహనాలు,డైయిరి, పౌల్ట్రీ, కిరాణం షాపులకు, సెంట్రింగ్ యూనిట్లకు యజమానులు అయ్యారన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి 13359 మంది లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందని10202 మందికి యూనిట్లను గ్రౌండింగ్ చేయడం జరిగిందని ఇంకా3357 గ్రౌండింగ్ చేయవలసి ఉన్నది అన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి 100 మంది దళిత బందు కింద లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందని అన్నారు. మరలా ప్రతి నియోజకవర్గంలో 1500 మందిని దళిత బంధు పథకం కింద ఎంపీల చేయనున్నామన్నారు. నేటి( మంగళవారం) నుండి 10 రోజుల పాటు మండల జిల్లా స్థాయి కమిటీలు లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమం చేపట్టి జూలై 11న ఎంపికైన లబ్ధిదారుల జాబితా ప్రదర్శించనున్నట్లు (విడుదల) మంత్రి తెలిపారు. జిల్లాలో దళిత బంధు పథకము ఎలాంటి అవకతవకలు లేకుండా, దుర్వినియోగం కాకుండా పగడ్బందీగా పారదర్శకంగా , విజయవంతంగా అమలు చేస్తున్నందుకు జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ ను మంత్రి అభినందించారు. మంత్రి డబుల్ బెడ్ రూమ్ పథకాన్ని సమీక్షిస్తూ హుజూరాబాద్ నియోజకవర్గం లో 3000, కరీంనగర్లో 1400, మానకొండూరు లో 891, చొప్పదండి నియోజకవర్గం లో 707 డబుల్ బెడ్ రూమ్ గృహాలు మంజూరు కాగా 789 గృహ నిర్మాణాలు పూర్తి అయినట్లు తెలిపారు. గురువారం హైదరాబాదులో ఇంజనీర్ ఇన్ చీఫ్ కార్యాలయంలో జిల్లా ఎమ్మెల్యేలతో సమావేశం ఉన్నందున జిల్లాలో అసంపూర్తిగా ఉన్న రోడ్లను పూర్తి చేసేందుకు కావలసిన నిధుల గురించి నివేదిక సమర్పించాలని మంత్రి ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు.
జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కనుమల్ల విజయ మాట్లాడుతూ దళిత బంధు పథకం కింద డైయీరీ యూనిట్ల లబ్ధిదారుల కోసం గేదెలను తమిళనాడు లేదా ఆంధ్ర నుండి తీసుకొని రావాలన్నారు.
మానకొండూరు శాసనసభ్యులు రసమయి బాలకిషన్ మాట్లాడుతూ డబుల్ బెడ్ రూమ్ పథకం కింద గ్రామంలో 50, అలుగునూర్ లో 16 పూర్తయ్యాయని రామకృష్ణపూర్ కాలనీలో డబుల్ బెడ్ ఇండ్లను త్వరితగతిన లబ్ధిదారులకు ఇవ్వాలని కోరారు.
చొప్పదండి శాసనసభ్యులు సుంకే రవిశంకర్ మాట్లాడుతూ చొప్పదండి నియోజకవర్గానికి 707 డబుల్ బెడ్ రూమ్ లో మంజూరయ్యాయని బెడ్ రూమ్ నిర్మాణాలు మొదలైన వాటి నిర్మాణాలను పూర్తిచేయాలని, ఇంకా మిగిలి ఉన్న పనులను పూర్తి చేసి గృహలను లబ్ధిదారులకు అందజేయాలన్నారు. గంగాధర ఎక్స్ రోడ్ వద్ద ఆర్ అండ్ బి రోడ్లు బాగు చేయాలి అన్నారు.హుస్నాబాద్ శాసనసభ్యులు సతీష్ బాబు మాట్లాడుతూ సైదాపూర్, చిగురు మామిడి మండలాల్లో డబుల్ బెడ్ రూమ్ 247 మంజూరు కాగా243 పూర్తి అయ్యాయని కోర్టు కేసుల వల్ల 4 పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. సైదాపూర్ హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలన్నారు.
ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ అర్హులైన వారందరికీ దళిత బందు మంజూరు చేయాలని అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గం లో మూడువేల డబుల్ బెడ్ రూమ్ 3000 మంజూరు కాగా1214 హుజరాబాద్ అర్బన్లో 500, జమ్మికుంట అర్బన్లో 553, వీణవంక మండలం లో 59, ఇల్లంతకుంట లో50 డబుల్ బెడ్ రూమ్ నిర్మాణాలు చేపట్టాల్సి ఉందన్నారు. జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ మాట్లాడుతూ రైతుబంధు లాగానే దళిత బంధువు జిల్లాలో పెద్ద ఎత్తున ప్రారంభించడం జరిగిందన్నారు హుజూరాబాద్ నియోజకవర్గం లో పైలెట్ ప్రాజెక్టుగా17554 మంది లబ్ధిదారులకు బ్యాంక్ అకౌంట్ లో ప్రారంభించడం జరిగిందన్నారు. నేటి వరకు10202 మంది లబ్ధిదారుల యూనిట్లను గ్రౌండింగ్ చేయడం జరిగిందని 3357 మంది లబ్ధిదారులకు యూనిట్లను చేయవలసి ఉన్నది అన్నారు. జెసిబి, హార్వెస్టర్, డైయిరీ, వాహనాలు, సెంట్రింగ్ మెట్లు, కిరాణా షాపు యూనిట్లను గ్రౌండింగ్ చేయడం జరిగిందన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గం లో దళిత బంధు యూనిట్లను విజయవంతంగా గ్రౌండింగ్ చేసినందులకు జిల్లా కలెక్టర్ ఎస్సీ కార్పొరేషన్ ఈడి సురేష్ ను కలెక్టర్ అభినందించారు.ఈ సమావేశంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్ పర్సన్ శ్రీనివాస్, సుడా చైర్మన్ జీవి రామకృష్ణ రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎందుకు రవీందర్ రెడ్డి, అదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్, శ్యామ్ ప్రసాద్ లాల్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సురేష్, ఆర్ అండ్ బి ఎస్ఈ చందర్, ఈ ఈ సాంబశివరావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ ఈ, నెహ్రూ యువ కేంద్ర కోఆర్డినేటర్ రాంబాబు,
మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, జిల్లా అధికారులు, కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents