గంజాయి పట్టివేత
వ్యక్తి అరెస్టు
గంగాధర పోలీసులు సోమవారం నాడు గంజాయిని పట్టుకొని ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. ఎస్ఐ కె రాజు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయిమండలంలోని గర్శకుర్తి గ్రామ శివారులో ఒక వ్యక్తి ప్లాస్టిక్ కవర్ వెంట పెట్టుకొని సంచరిస్తున్నాడని అందిన సమాచారం మేరకు ఆ ప్రాంతంలో గాలించారు. మెదక్ జిల్లా పటాన్ చెరువు ప్రాంతంలోని చిటుకుల్ గ్రామానికి చెందిన మల్లేష్ (20) అదుపులోకి తీసుకొని తనిఖీ చేశారు. ఇతని వద్ద 8560 రూపాయల విలువ చేసే 1260 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇతడు గతంలో గంజాయి కేసులో పట్టుబడి జైలుశిక్ష అనుభవించివచ్చాడు. అతనిపై పటాన్ చెరురు పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలకు సంబంధించి మరో 7 కేసులు నమోదు ఉన్నట్లు విచారణలో తేలింది. ఈ ప్రాంత యువతకు గంజాయిని వికరించేందుకు వచ్చినట్లు అంగీకరించాడు. అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు.
యువత వ్యసనాలకు బానిస కావద్దు
యువత గంజాయి ఇతరత్రా అవసరాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దని చొప్పదండి సిఐ జి రవీందర్ అన్నారు. యువత జీవితాలతో చెలగాటం ఆడేందుకు గ్రామాల్లో సంచరించే అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉంటూ పోలీసులకు సమాచారం అందించాలని కోరారు