బావమరిది పై బావ కత్తితో దాడి

పెద్దపల్లి ఘటన

0 10

బావమరిది పై బావ కత్తితో దాడి చేసిన సంఘటన పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. సోమవారం రాత్రి బస్టాండ్ సమీపంలో అప్పన పేట గ్రామానికి చెందిన పిడుగు శ్రీకాంత్ పై అతని బావ సబ్బితం గ్రామానికి చెందిన భూత గడ్డల అజయ్ కుమార్ కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో శ్రీకాంత్ కు తలపై కడుపులో తీవ్రగాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన శ్రీకాంత్ పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం తో వైద్యులు చికిత్స ప్రారంభించారు.

సంఘటన స్థలాన్ని పెద్దపల్లి సిఐ ప్రదీప్ కుమార్, ఎస్సై రాజేష్ లు పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. బాధితుడు శ్రీకాంత్ సోదరిని అజయ్ వివాహం చేసుకుంటానని నమ్మించి మోసగించడం తో గత కొన్నేళ్లుగా ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయని పలు కేసులు బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ లో నమోదయ్యాయని సిఐ ప్రదీప్ కుమార్ పేర్కొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents