అగ్నిపథ్ ను వెంటనే రద్దు చేయాలి

- ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బ్రమాండ్లపల్లి యుగేందర్

0 4,875

దేశంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆగమేఘాలమీద తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకం నిరుద్యోగ యువత ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విదంగా ఉందని, యువత భవిష్యత్ కు గొడ్డలిపెట్టుగా మారిన అగ్నిపథ్ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బ్రమాండ్లపల్లి ఆరోపించారు.బుధవారం రోజున ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర సమితి పిలుపు మేరకు స్థానిక కమాన్ చౌరస్తాలో నరేంద్రమోదీ దిష్టిబొమ్మను దగ్దం చేశారు . ఈ సందర్భంగా యుగేందర్ మాట్లాడుతూ దేశంలో అత్యంత కీలకమైన రక్షణ వ్యవస్థ ఆర్మీ కి తూట్లు పొడిచేందుకే మోడీ ప్రభుత్వం అగ్నిపత్ పథకాన్ని ప్రవేశపెట్టిందని,దింతో ఇప్పటికే కుటుంబ సభ్యులను విడిచి దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమర జవానుల ఆత్మలు గోషిస్తాయని ఆవేదన వ్యక్తంచేశారు.
అధికార బలంతో నరేంద్రమోడీ సర్కార్ పార్లమెంటులో ఎలాంటి చర్చ జరపకుండానే ఏకపక్షంగా నల్ల చట్టాలను తీసుకురావడం పరిపాటిగా మారిందని మండిపడ్డారు. అగ్నిపథ్ ను దేశ వ్యాప్తంగా నిరుద్యోగులు వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని వెనక్కి తీసుకొపోగా నిరుద్యోగులు రెచ్చగొట్టే విధంగా ప్రకటనలు చేయడం సరైందికాదని హితవు పలికారు. ఎన్నికల ముందు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత మోడీ ప్రభుత్వం నిరుద్యోగులకు మొండిచెయ్యి చూపించిందని ఎద్దేవా చేశారు. నిరుద్యోగులను నయవంచన చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దొందూదొందేనని అగ్నిపథ్ పథకం పై కేసీఆర్ బహిరంగ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. భారత రక్షణ వ్యవస్థ పటిష్టం కోసం,త్యాగలతో కూడిన ఆర్మీ రావడం కోసం అగ్నిపథ్ పథకం ను వెంటనే రద్దు చేసి జాతీయస్థాయిలో సమగ్ర జాతీయ యువజన విధానం ప్రకటించాలని యుగేందర్ డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ AIYF జిల్లా అధ్యక్షులు సంతోష్ చారి సహాయ కార్యదర్శి ఉట్ల తిరుపతి నగర అధ్యక్ష కార్యదర్శులు మాడిశెట్టి అరవింద చంచల మురళి పినమల్ల భాస్కర్ అవినాష్ శ్రీకాంత్ ప్రభాకర్ తిరుపతితదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents