నగర ప్రజలకు త్వరలో 24/7 మంచినీరు అందిస్తాం

0 2

* నగర ప్రజలకు త్వరలో 24/7 మంచినీరు అందిస్తాం.

* 24/7 వాటర్ సప్లై పాయిలెట్ ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలి.

* పాయిలెట్ ప్రాజెక్ట్ ను విజయవంతం చేసేలా అధికారులు, ఏజెన్సీ కాంట్రాక్టర్ చర్యలు తీసుకోవాలి.

* మేయర్ క్యాంపు కార్యాలయంలో ఇంజనీరింగ్ అధికారులు, ఆర్వీ అధికారులు, ప్రాజెక్ట్ ఏజెన్సీ కాంట్రాక్టర్ తో సమావేశం.

* 24/7 వాటర్ సప్లై పాయిలెట్ ప్రాజెక్ట్ పై మేయర్ సునీల్ రావు వివరించిన ఏజెన్సీ.

* సలహాలు సూచనలు చేసి ఆదేశాలు జారీ చేసిన మేయర్.

24/7 వాటర్ సప్లై పాయిలెట్ ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలని నగర మేయర్ యాదగిరి సునీల్ రావు అధికారులు, ఏజెన్సీ కాంట్రాక్టర్లను ఆదేశించారు. కరీంనగర్ అభివృద్ధిలో భాగంగా బుధవారం రోజు భగత్ నగర్ లోని క్యాంపు కార్యాలయంలో మేయర్ యాదగిరి సునీల్ రావు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులు, ఆర్వీ అధికారులు, ఏజెన్సీ కాంట్రాక్టర్ తో సమావేశం నిర్వహించారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ లో ఏర్పాటు చేసే.. 24 గంటల మంచినీటి సరఫరా టాయిలెట్ ప్రాజెక్టు విషయంపై ఏజెన్సీ కాంట్రాక్టర్, అధికారులతో మేయర్ సునీల్ రావు సుదీర్ఘంగా చర్చించారు. పాయిలెట్ ప్రాజెక్టు పనులకు సంబంధించిన వివరాలను సర్వే డిజైన్ మ్యాప్ ఆధారంగా చేపట్టబోయే కార్యక్రమాలను మేయర్ సునీల్ రావు కు వివరించారు. అనంతరం మేయర్ పలు సలహాలు సూచనలు చేస్తూ ఆదేశాలు జారీచేశారు. ఈ సందర్భంగా మేయర్ సునీల్ రావు మాట్లాడుతూ… నగర ప్రజలకు ప్రతిరోజు మంచినీటి సరఫరా చేస్తున్న విధంగానే త్వరలో 24 గంటలు మంచినీరు అందించేలా నగరపాలక సంస్థ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. నగరంలోని హౌసింగ్ బోర్డ్, భగత్ నగర్, కోతి రాంపూర్ మంచినీటి రిజర్వాయర్లను పాయిలెట్ ప్రాజెక్ట్ కింద గుర్తించామన్నారు. పాయిలెట్ ప్రాజెక్ట్ పనులను ఏజెన్సీ ద్వారా వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే సంబంధిత ఏజెన్సీని పనులను వేగవంతం చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. నగరంలో హౌసింగ్ బోర్డ్ రిజర్వాయర్ పరిధిని మొదటి దశ పైలెట్ కింద తీసుకొని ప్రాజెక్టును ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులు ఏజెన్సీ కాంట్రాక్టర్ ను ఆదేశించినట్లు తెలిపారు. మొదటి పాయిలెట్ ప్రాజెక్టుకు సంబంధించి ఏజెన్సీ పూర్తిస్థాయిలో సమగ్రంగా సర్వేను చేసిందన్నారు. పాయిలేట్ ప్రాజెక్టు ను ట్రయల్ రన్ చేసేందుకు కు చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. దీనికి సంబంధించి ఇంజనీరింగ్ అధికారులు, ఆర్ వి అధికారులు, ఏజెన్సి కాంట్రాక్టర్ ను ఆదేశించినట్లు తెలిపారు. 24 గంటలు మంచినీటి సరఫరా చేసే సమయంలో నగరంలో ఎక్కడ కూడా వాటర్ సప్లై కి ఇబ్బంది రాకుండా జాగ్రత్తలు వహించాలని ఆదేశించినట్లు తెలిపారు. హౌసింగ్ బోర్డ్ పూర్తిస్థాయిలో సక్సెస్ చేసిన అనంతరమే మిగిలిన రెండు పాయిలెట్ ప్రాజెక్టు రిజర్వాయర్లలో పనులు చేపట్టాలన్నారు. ప్రాజెక్టు పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు అధికారులు ఏజెన్సీ చర్యలు తీసుకోవాలన్నారు. 24 గంటల మంచినీటి సరఫరాను నగరంలో అధికారులు ఏజెన్సీ కాంట్రాక్టర్ పూర్తి స్థాయిలో విజయవంతమయ్యేల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఎస్ ఈ నాగమల్లేశ్వరరావు, ఈఈ మహేందర్, డిఇ వెంకటేశ్వర్లు, ఆర్ వి అధికారులు సందీప్, మురళి కృష్ణ పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents