మనఊరు -మనబడి మన బస్తి మనబడి పనుల్లో రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో కరీంనగర్ జిల్లా
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు- మన బడి మన బస్తి- మన బడి అనే బృహత్తర పథకం ప్రవేశపెట్టిందని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన పనుల్లో కరీంనగర్ జిల్లా రాష్ట్రంలోనే రెండవ స్థానంలో నిలిచిందని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ తెలిపారు.రాష్ట్ర వ్యాప్తంగా 7289 రూపాయలతో దశలవారీగా పాఠశాలలో అభివృద్ధి పనులను ప్రభుత్వం చేపడుతుందని గ్రామస్థాయిలో మన ఊరు మన బడి పట్టణాల్లో మనబస్తి మనబడి అనే పేరుతో అమలు అవుతుందన్నారు. మొదటి దశలో మండలాన్ని యూనిట్ గా తీసుకొని 9123 పాఠశాలల్లో 3697 కోట్ల రూపాయలతో ప్రభుత్వం కార్యచరణ ప్రారంభించి 12 రకాల మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిందన్నారు. డిజిటల్ విద్య అమలు, విద్యుదీకరణ, తాగునీటి సరఫరా, సరిపడా ఫర్నిచర్, పాఠశాలలకు మరమ్మతులు, పాఠశాలలకు రంగులు వేయడం, గ్రీన్ ఛానల్ బోర్డులు ఏర్పాటు, ప్రహరీ గోడ నిర్మాణం కిచెన్ షెడ్ల నిర్మాణం, అదనపు తరగతుల నిర్మాణం, ఉన్నత పాఠశాలలో డైనింగ్ హాల్ నిర్మాణం, నీటి సౌకర్యం తో కూడిన మరుగుదొడ్ల నిర్మాణం వీటితో పాటు అనేక రకాల సదుపాయాలను మన ఊరు మనబడి ద్వారా ప్రభుత్వం కల్పిస్తుందన్నారు.
కరీంనగర్ జిల్లాలో 651 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని ఇందులో 149 ఉన్నత పాఠశాలలు,76 ప్రాథమికోన్నత పాఠశాలలు, 426 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయన్నారు. జిల్లాలో మన ఊరు మన బడి మన బస్తి- మనబడి కార్యక్రమంలో మొదటి దశలో లోని 230 ప్రభుత్వ పాఠశాలల్లో 94 ఉన్నత పాఠశాలలు, 120 ప్రాథమిక పాఠశాలలు,16 ప్రాథమికోన్నత పాఠశాలలలొ జూన్ 3 నుండి 30 వరకు మౌలిక సదుపాయాల కల్పన పనులు చేపట్టడం జరిగిందన్నారు.230 ప్రభుత్వ పాఠశాలల్లో 182 గ్రామీణ ప్రాంతం నుండి 48 పట్టణ ప్రాంతం నుండి ఎంపిక చేయడం జరిగిందన్నారు. 11 స్మార్ట్ సిటీ క్రింద 5 విద్యార్థుల గల వేగా గుర్తించడం జరిగిందన్నారు.214 పాఠశాలలో బడ్జెట్ అంచనా 30 లక్షలు దాటిన పాఠశాలలు11, రు.30 లక్షల లోపు 203 పాఠశాలలని, ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇచ్చిన పాఠశాలలు 142, పనులు గ్రౌండింగ్ అయిన పాఠశాలలు145 అని కలెక్టర్ తెలిపారు. పాఠశాలలో పనులు ప్రారంభించిన జిల్లాలో కరీంనగర్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలోనే రెండవ స్థానంలో(71.08%) ఉన్నదని కలెక్టర్ తెలిపారు. మిగిలిన ఎటువంటి పాఠశాలల్లో కూడా పనులు ప్రారంభించుటకు తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. మిగిలిపోయిన పనులకు వెంటనే పూర్తి చేయుటకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు ఇప్పటివరకు కోటి 53 లక్షలు నిధులను పాఠశాలలకు విడుదల చేయడం జరిగిందన్నారు.