అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ వైద్యుల దినోత్సవ వేడుకలు
అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ వైద్యుల దినోత్సవ చార్టర్డ్ అకౌంటెంట్ మరియు పోస్టల్ దినోత్సవ వేడుకలు
- అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ వైద్యుల దినోత్సవ చార్టర్డ్ అకౌంటెంట్ మరియు పోస్టల్ దినోత్సవ వేడుకలు
అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ జిల్లా 137 ఆధ్వర్యంలో నేషనల్ డాక్టర్స్ డే ని చార్టర్ అకౌంటెంట్స్ డే మరియు పోస్టల్ డే ని ఘనంగా స్థానిక వాసుదేవ హాస్పిటల్ లో అలయన్స్ ఇంటర్నేషనల్ అడ్వైజర్ డా. ఎలగందుల శ్రీనివాస్ నిర్వహించారు. ఈ సందర్బంగా అలయన్స్ క్లబ్ బృందం వైద్య రంగంలో విశేష సేవలందిస్తున్న డా. ఎలగందుల శ్రీనివాస్, డా. సౌమ్య శ్రీదేవి, డా. సాయిప్రసాదరావు, డా. రామకృష్ణ శ్రీరామోజు,డా. సాయిలీల, చార్టర్డ్ అకౌంటెంట్స్ నంబూరి విజయ్, కొత్తిరెడ్డి శ్రీధర్ రెడ్డి పోస్టల్ ఉద్యోగి నవీన్ మున్నగు వారిని ఘనంగా సన్మానించారు.
ఈ సందర్బంగా డా. ఎలగందుల శ్రీనివాస్ గారు మాట్లాడుతూ డా.బిసి రాయి జన్మదినాన్ని పురస్కరించుకొని జాతీయ వైద్యుల దినోత్సవ వేడుకలను నిర్వహించడం జరుగుతుందని అలాగే ఈ రోజున చార్టర్ అకౌంటెంట్స్ డే, పోస్టల్ డే లను నిర్వహించడం ఈ రంగాల్లో ఇతోధికంగా సేవలాందిస్తున్న వారిని సన్మానించడం తమకు సంతృప్తి ని ఇచ్చిందని తెలిపారు. అలయన్స్ జిల్లా గవర్నర్ గాలిపల్లి నాగేశ్వర్ మాట్లాడుతూ నేడు సమాజంలో ప్రముఖమైన రంగాలలో విశిష్ట సేవలందిస్తున్న వీరిని గౌరవించుకునే గొప్ప అవకాశం అలయన్స్ ఇంటర్నేషనల్ కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరపడం అదృష్టం గా భావిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమం లో అలయన్స్ సౌత్ ఇండియా చైర్మన్ సిద్దుల బాలకృష్ణ,ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ ఇంజనీర్ కోల అన్నారెడ్డి, జిల్లా క్యాబినెట్ సెక్రటరీ శ్రీనివాస్ గాంధీ, కోశాధికారి చకిలం స్వప్న,భగత్ నగర్ అలయన్స్ అధ్యక్షులు మొగులోజు సత్యా చారి, వరుణ్ భూపతి, కర్ర వెంకన్న, వైద్యులు డాక్టర్ సాయి ప్రసాద్ రావు, డాక్టర్ రామకృష్ణ శ్రీరామోజు డాక్టర్ సౌమ్య శ్రీదేవి,డాక్టర్ సాయి లీల, సి ఏ లు నంబూరి విజయ్, కొత్తి రెడ్డి శ్రీధర్ రెడ్డి, పోస్టల్ ఉద్యోగి నవీన్ మరియు వాసుదేవ హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.