మోడీ పాలనలో విశ్వ గురువుగా అవతరించిన భారత్

బిజెపి రాజస్థాన్ రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్యే సతీష్ పునియా ..

0 17,855

2014 సంవత్సరంలో ఏర్పడిన మోడీ బిజెపి ప్రభుత్వం భారత్ దిశ దశ మార్చడానికి , దేశ పురోగతి కోసం ఎనిమిదేళ్ల పాలనలో ఎన్నోసంస్కరణలు , చారిత్రక నిర్ణయాలు తీసుకొని దేశాభివృద్ధికి నూతన మార్గాలు వేసి అద్భుతాలు సృష్టించి భారత దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలపడానికి నిర్విరామంగా కృషి చేసి విజయాలు సాధించి నేడు విశ్వ గురువుగా అవతరించిందని బిజెపి రాజస్థాన్ అధ్యక్షులు, ఎమ్మెల్యే సతీష్ పునియా తెలిపారు. సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కరీంనగర్ లోని వి పార్కులో బిజెపి మహిళా మోర్చా, దళిత మోర్చా , ఎస్టి మోర్చా, మైనార్టీ మోర్చా జిల్లా సమావేశాలతో పాటు కరీంనగర్ అసెంబ్లీ పోలింగ్ బూత్ అధ్యక్ష , శక్తి కేంద్ర విద్యార్థుల సమావేశం జరిగింది. ఇట్టి సమావేశాల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం8 సంవత్సరాల పాలనలో దేశ భవిష్యత్తు, గతిశక్తి మార్చడానికి ప్రయత్నం చేసిందన్నారు .ముఖ్యంగా మోడీ ప్రభుత్వం దేశ సేవ, సుపరిపాలన, పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తుందన్నారు. ఎన్నో దశాబ్దాల పాటు దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ స్వార్థ రాజకీయాల కోసం దేశ భవిష్యత్తును నిర్వీర్యం చేసిందని , అందుకే 2014 కు ముందు భారతదేశం ఆ తర్వాత దేశం అనే విధంగా మోడీ ప్రభుత్వం కీలకసంస్కరణలు , చారిత్రక నిర్ణయాలు తీసుకొని ముందుకు కొనసాగుతుందన్నారు. 370 ఆర్టికల్ రద్దు , త్రిపుల్ తలాక్, నోట్ల రద్దు, రామమందిర నిర్మాణం , జిఎస్టి, డిజిటల్ లావాదేవీలు ,వన్ నేషన్ వన్ రేషన్ కార్డు , మేక్ ఇన్ ఇండియా ,ఆత్మ నిర్భర భారత్, నూతన విద్యా విధానం , దేశ ప్రజలందరికీ ఉచిత కరోనా వ్యాక్సిన్ , ఉచిత రేషన్ లాంటి అనేకసాహసోపేత నిర్ణయాలు దేశ ప్రగతికి బాటలు గా మారాయన్నారు.

Also Read :

దేశంలోని అన్ని వర్గాల ప్రజల, రైతుల, మహిళల ,యువకుల సంక్షేమ
అభివృద్ధి కి , మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాల ద్వారా బిజెపి ప్రభుత్వం చేయూతనిస్తుందని తెలిపారు. ప్రధాని మోడీ పాలన పై ప్రజలకు విశ్వసనీయత ఉందని , దేశ హితం, శ్రేయస్సు , రక్షణ భద్రత కోసం అనునిత్యం ఆలోచన చేసే మోడీ ప్రభుత్వ విధానాలకు దేశ ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. ముఖ్యంగా దేశ భద్రత ,రక్షణ విషయంలో ఎనిమిదేళ్ల మోడీ ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలతో భారత్ అత్యాధునిక ఆయుధ సంపత్తి కలిగి ఉందని, దీంతో రక్షణ పరంగా ప్రపంచంలోనే భారత్ ధీటైన శక్తిగా అవతరించిందన్నారు. ఈజ్ఆఫ్ లివింగ్ అనేది ప్రతి పౌరుని హక్కు, అందుకేదీన్ని మరింత ముందుకు తీసుకు వెళ్లడం మోడీ బిజెపి ప్రభుత్వ ప్రాధాన్యతని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. దేశంలో అన్ని వర్గాలను సమాన దృష్టితో చూస్తూ సూపరి పాలన అందిస్తున్న మోడీ ప్రభుత్వానికి ప్రజలందరూ అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. మూడో తేదీన హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో జరిగే ప్రధాని మోడీ సభకు ప్రజలందరూ స్వచ్ఛందంగా తరలివచ్చి విజయవంతం చేయడానికి బిజెపి శ్రేణులు తగిన కృషి చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాజ్యమేలుతున్న కుటుంబ టిఆర్ఎస్ పార్టీని తరిమి కొట్టడానికి పోలింగ్ బూత్ స్థాయి నుండి తగిన కార్యక్రమాలు చేపట్టాలని, పార్టీ సంస్థాగత పోలింగ్ బూత్ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయాలని సూచించారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పోలింగ్ బూత్ స్థాయి నుండి చేపట్టాల్సిన కార్యక్రమాలను పోలింగ్ బూత్ అధ్యక్షులకు, శక్తి కేంద్ర ఇన్చార్జిలకు వివరించి తగిన సూచనలు ఇచ్చారు. అనంతరం కొత్త పల్లి మండల ఎస్సీ మోర్చా అధ్యక్షులు నల్వాల మహేష్ ఇంట్లో ఏర్పాటుచేసిన మధ్యాహ్న భోజన కార్యక్రమంలో రాజస్థాన్ అధ్యక్షులు ఎమ్మెల్యే సతీష్ పునియ పాల్గొని స్థానిక నాయకులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అలాగే కరీంనగర్ సౌత్ జోన్ ప్రధాన కార్యదర్శి పురం హరి ఏర్పాటు చేసిన తేనేటి కార్యక్రమంలో పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents