రేపు జరిగే విజయ సంకల్ప సభను విజయవంతం చేద్దాం…
-కరీంనగర్ నుండి భారీగా తరలి వెళ్ళనున్న యువత...
రేపు జరిగే విజయ సంకల్పం సభను విజయవంతం చేయాలని కరీంనగర్ పట్టణ ప్రాంతంలో పలు వీధుల్లో గడపగడపకు తిరిగి విజయ సంకల్ప సభ విజయవంతం చేయాలని
యువత పెద్ద సంఖ్యలో తరలి వెళ్లాలని .అలాగే సీఎం కేసీఆర్ కుటిలబుద్ధి మరోసారి బయటపడింది అని. ప్రధాని మోడీగారు తెలంగాణకు వస్తుంటే తన పేరు ఎక్కడ వినబడకుండా పోతుందోనని భయం పట్టుకుంది. అందుకే ప్రజాధనంతో నగరం మొత్తం హోర్డింగ్స్ పెట్టిస్తున్నడు. హైదరాబాద్‌లోని మెట్రో పిల్లర్లు, హోర్డింగ్స్ని రాష్ట్ర సర్కార్ ప్రకటనలతో ముంచెత్తుతోంది. సిటీలోని ప్రధాన ప్రాంతాల్లో పెద్ద దొర కేసీఆర్, చిన్న దొర కేటీఆర్ చిత్రాల ఫ్లెక్సీలు భారీ ఎత్తున ఏర్పాటు చేసింది. వారం రోజుల పాటు ఈ ప్రచార హోరు కొనసాగనుంది. ఇందుకోసం కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చు చేస్తున్నరు. కేసీఆర్… బీజేపీకి పోటీగా ఎన్ని హోర్డింగ్స్ అయినా పెట్టుకో… కానీ ప్రజల పైసలతో ప్రచారం చేసుకునే హక్కు నీకు ఎవరిచ్చారు? ముఖ్యమంత్రి పదవి అంటే నిజాం రాజు పదవి అనుకుంటున్నవా? బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, మోడీగారి సభ జరగనున్న రోజుల్లో బీజేపీకి సరైన ప్రచారం లభించకుండా కేసీఆర్ ఈ చిల్లర ఎత్తుగడ వేశాడు. కేసీఆర్.. ప్రధాని నరేంద్ర మోడీ గారు నీలాగా ఫామ్ హౌస్ పీఎం కాదు. ప్రజల మనిషి నీకు కావాలేమో హోర్డింగ్ లు, ఫ్లెక్సీలు…. మాకు అవసరం లేదు. నీ భజన బ్యాచ్ సిటీ మొత్తాన్ని ప్రకటనలతో నింపేసినా… నీ పార్టీని నమ్మే స్థితిలో ప్రజలు లేరు. హైదరాబాద్‌లో మొత్తం 2,599 వరకు మెట్రో పిల్లర్లు ఉంటే… వీటన్నింటిని కేసీఆర్ సర్కార్ ఫ్లెక్సీలతో నింపేసింది. కేసీఆర్ సర్కార్ చేస్తున్న ఈ చిల్లర రాజకీయాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నరు. మోడీగారంటే కేసీఆర్‌కి ఇంత భయమా? అని మాట్లాడుకుంటున్నరు. నైతికంగా మేము ఎప్పుడో విజయం సాధించాం. ఎన్నికల్లో విజయం ఒక్కటే బాకీ ఉంది. రాబోయే రోజుల్లో అది కూడా చేసి చూపిస్తం. కేసీఆర్ హోర్డింగుల రాజకీయాన్ని త్వరలోనే ఫామ్ హౌస్‌కి పంపిస్తాం అని.బోయినపల్లి ప్రవీణ్ రావు అన్నారు ఈ క్రమంలో గుండారపు సంపత్,న్యాత ప్రవీణ్, శివ,నితీష్,సాయి . తదితరులు పాల్గొన్నారు