తాత పుస్తకం తెరిచి చూసిన మనవడికి మైండ్ బ్లాక్..

అసలు ఆ పుస్తకంలో ఏముందంటే..?!

0 0

ఈ మధ్యకాలంలో చాలామంది పురాతన కాలపు సంబంధించిన వస్తువులు, నాణ్యాలు, కరెన్సీ లాంటివి పోగుచేసి దాచుకోవడం వాటిని అపురూపంగా చూసుకోవడం ఎక్కువగా చేస్తున్నారు.ఇందులో భాగంగానే ఇదివరకు కొందరు ప్రముఖులు ఉపయోగించిన వారి వస్తువులను ఒకరి దగ్గర నుంచి ఇంకొకరు కోట్లు పోసి మరి కొనుక్కుంటున్నారు.

అయితే కొన్ని కోట్లు పోసి కొందామన్నా దొరకని అపురూపాలు మన చేతికందితే ఎలాంటి ఆనందం కలుగుతుందో చెప్పండి.అయితే ఇలాంటి అనుభూతి ఓ వ్యక్తికి తాజాగా ఎదురైంది. ఇందుకు సంబంధించి అసలు విషయంలోకి వెళితే.

TeluguStop.com - తాత పుస్తకం తెరిచి చూసిన మనవడికి మైండ్ బ్లాక్.. అసలు ఆ పుస్తకంలో ఏముందంటే..-General-Telugu-Telugu Tollywood Photo Image

విజయ్ బస్రూర్ అనే నెటిజన్ తన తల్లితో పాటు ఇంటిని సర్దడంలో నిమగ్నమై ఉన్నాడు.

ఇలా పనిచేసిన సమయంలో విజయ్ కు తన ఇంటిలోని మూల ప్రదేశంలో ఓ పుస్తకం తన కంట పడింది.ఆ పుస్తకం ఏంటి.? అందులో ఏముందని ఆలోచిస్తూ అతడు ఆ పుస్తకాన్ని తెరిచి చూడగానే షాక్ కొట్టినంత పని అయింది.అలా కొద్దిసేపు వరకు అతనికి ఏం జరుగుతోందో, తాను చూసింది నిజమో కాదో అని తేరుకోలేకపోయాడు. అలా ఆయన తేరుకున్న తర్వాత ఆ పుస్తకంలో ఉన్న వాటిని చూడడం మొదలు పెట్టాడు.

ఇంతకీ ఆ పుస్తకంలో ఏముంది అంటే తన తాత ఎంతో కష్టపడి ఎంతో మంది ప్రముఖుల దగ్గర తీసుకున్న ఆటోగ్రాఫ్స్ లు అతనికి కనపడ్డాయి. విజయ్ తాత ఆటోగ్రాఫ్ లు తీసుకున్న ఆ పుస్తకంలో భారతదేశ ప్రముఖ మహానాయకుడు మహాత్మాగాంధీ, భారతదేశ మొట్టమొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ సంతకాలు అందులో కనపడటంతో తన సంతోషానికి అవధులు లేకుండా పోయాయని ఆయన చెప్పుకొచ్చాడు.ఇందుకు సంబంధించిన ఫోటోలను తాజాగా విజయ్ సోషల్ మీడియా ద్వారా పంచుకోగా ఎంతో మంది నెటిజన్లు విజయ్ ను అభినందిస్తున్నారు. అతడు ఎంతో విలువైన వస్తువును గెలిచావ్ అంటూ నెటిజెన్స్ పెద్దఎత్తున అభినందనలు తెలియజేస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents