వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ…
రాజన్న సిరిసిల్ల : ఎములాడ రాజన్న ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ కనిపించింది. వేకుమజామునే భక్తులు స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. భక్తి శ్రద్ధలతో పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి వారిని 10 వేల మందికి పైగా భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా కొవిడ్ పాటిస్తూ దర్శనం చేసుకునేలా ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేసింది.