కేసీఆర్ పతనం కాయం …
బీజెవైఎం నాయకులు దూరిశెట్టి సంపత్
కరీంనగర్: తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులను, ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్లనున నిర్లక్ష్యం చేస్తూ వారికి తీవ్ర అన్యాయం చేస్తున్న కారణంగా కేసిఆర్ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన BJYM తెలంగాణ రాష్ట్ర శాఖ ఎమ్మార్వో ఆఫీస్ ముందు ధర్నా కు పిలుపునిచ్చింది అందులో భాగంగా భారతీయ జనతా యువమోర్చా BJYM కరినగర్ రురల్ మండల అధ్యక్షుడు కూకట్ల రమేష్ ఆధ్వర్యంలో కరినగర్ రురల్ ఎమ్మార్వో ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి వినతిపత్రం పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర నాయకులు దురిశెట్టి సంపత్ మాట్లాడుతూ..లక్ష ఉద్యోగాలు ఇస్తానని అధికారంలోకి వచ్చి, ఆరేండ్లు అయిన సగం కూడా ఉద్యోగాలు ఇయ్యలే తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ఇప్పటివరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా పూర్తి చేసినవి కేవలం 35,724 ఉద్యోగాలే.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్కసారి కూడా వెలువడని గ్రూప్ 1,3 నోటిఫికేషన్ అని అన్నారుఎన్నికల్లో రూ.3106 నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక ఆ ఉసే ఎత్తని ముఖ్యమంత్రి అని ఎద్దేవా చేశారు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులను, ప్రైవేట్ టీచర్స్,లెక్చరర్లనున నిర్లక్ష్యం చేస్తూ వారికి తీవ్ర అన్యాయం చేస్తున్న కారణంగా కేసిఆర్ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేసారు ఈ ఉద్యమాన్ని ఉధృతం అని అన్నారు ఈ కార్యక్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు మడిశెట్టి సంతోష్ పాశం తిరుపతి కమలాకర్ యుధిస్టర్ గొల్లపెళ్లి ప్రవీణ్ అనిల్ సంకరి సతీష్ అజయ్ దీపక్ శేఖర్ పునిందర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు…