బడుగు బలహీన వర్గాలు, మైనార్టీల సంక్షేమే   ప్రభుత్వం ఆలోచన

 51 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి లక్ష రూ. చొప్పున చెక్కులు అందజేసిన మంత్రి.

0 0

కరీంనగర్: బడుగు బలహీన వర్గాలు, మైనార్టీల సంక్షేమమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ద్యేయం అన్నారు మంత్రి గంగుల కమలాకర్. కరీంనగర్ కలెక్టరెట్ ఆడిటోరియంలో ఈ రోజు నగరపాలక సంస్థకు చెందిన 2018-19 సంవత్సరంకు సంబందించి మైనార్టీ కార్పోరేషన్ లోన్ల చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. నగరపాలక కమీషనర్ వల్లూరు క్రాంతి ఆద్వర్యంలో పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, కలెక్టర్ కే.శశాంక, మేయర్ సునిల్ రావు లు మైనార్టీ కార్పోరేషన్ ద్వారా లబ్ధి పొందిన వారికి చెంకులు పంపిణీ చేశారు. గతంలోనే నగరపాలక సంస్థ ద్వారా దరఖాస్తు చేసుకున్న 71 దరఖాస్తుల్లో 51 మంది దరఖాస్తు దారులకు మైనార్టీ కార్పోరేషన్ 80% సబ్సిడీతో గ్రాంట్ ను మంజూరు చేసింది. 20% లోన్ కాంట్రీ బ్యూషన్ చెల్లించిన 51 మందికి ఒక్కొక్కరికి లక్ష రూ. చొప్పున మంత్రి గంగుల కమలాకర్ గారి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ సంధర్బంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ… బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలు ఆర్థికంగా ఎదుగేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధిక సబ్సిడీతో లోన్లు మరియు గ్రాంట్ల ను అందిస్తుందని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేస్కోని…తమ వ్యాపార సంస్థను నెలకొల్పాలన్నారు. ప్రభుత్వం ఇస్తున్న చేయూతను దుర్వినియోగం చేయకుండ ఆర్థింగా ఎదగాలని సూచించారు. ప్రజల జీవన విదానంలో మార్పు తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. అన్ని మతాలు, కులాలు కలిసి జీవించే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని మంత్రి తెలిపారు. చదుకున్న వారికి ఉద్యోగా అవకాశాలు, చదువు లేని వారికి వ్యాపార అవకాశాలను ముఖ్యమంత్రి కేసిఆర్ కల్పిస్తున్నారని స్పష్టం చేశారు. గత ప్రభుత్వాల పాలనలో లోన్లు ఇవ్వాలంటే బ్యాంకులు ముందుకు వచ్చే పరిస్థితి ఉండేది కాదని… ఒక వేల బ్యాంకులు ముందుకు వచ్చిన భూమిని, ఇండ్లను తాకట్టు పెట్టి లోన్లు పొందే అవకాశం ఉండేదని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు తర్వత అన్ని వర్గాల ప్రజలకు బ్యాంకుల ద్వారా అధిక సబ్సిడీని అందిస్తూ.. లోన్లు పొందే అవకాశం కల్పించిందని అన్నారు. మరో వైపు జిల్లా కలెక్టర్ కే.శశాంక మాట్లాడుతూ…  తెలంగాణ ప్రభుత్వం వ్యాపారలను నెలకొల్పి… సెల్ఫ్ ఎంప్లాయి మెంట్ ద్వారా ఆర్థికంగా ఎదగాలని చేయూతను అందిస్తుందని తెలిపారు.

నగరంలో 71 దరఖాస్తులకు 51 మంది మైనార్టీ లబ్ధిదారులకు మైనార్టీ కార్పోరేషన్ లోన్లను మంజూరు చేసిందని స్పష్టం చేశారు. అందించిన ఆర్థిక సహాయంతో ఇన్ కాం జనరేట్ చేస్కోని… సుఖంగా జీవించాలన్నారు. మైనార్టీ కార్పోరేషన్ లోన్ల మంజూరు చేయడంలో మంత్రి గంగుల కమలాకర్ గారి కృషి చాలా ఉందని తెలిపారు. లోన్ల మంజూరు విషయంలో ముఖ్యపాత్ర పోషించిన ప్రజలకు చేయూతను ఇస్తున్న మంత్రి గంగుల కమలాకర్ గారికి ప్రత్యేక అభినంధనలు తెలిపారు. మరో వైపు నగర మేయర్ వై.సునిల్ రావు మాట్లాడుతూ… అన్ని వర్గాల వారు సంతోషంగా జీవించాలని ముఖ్యమంత్రి కేసిఆర్ గారు ఆలోచన చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న చేయూతను అందరు సద్వినియేగం చేసుకొని ఉపాధి అవకాశాలను పొందాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం వెనుబడిన వర్గాల వారికి ఆర్థిక వనరులు పెంచుకునే విధంగా లోన్లను మంజూరు చేస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరు ఇచ్చిన గ్రాంట్లను వినియోగించి వ్యాపారం చేస్కొని ఆర్థికంగా నిలదొక్కుకోవాలని పిలుపు నిచ్చారు. నగరపాలక సంస్థ ద్వారా దరఖాస్తు చేసుకున్న 51 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసినట్లు మేయర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి హరిశంకర్, మాజీ మేయర్ సర్ధార్ రవీంధర్ సింగ్, నగరపాలక సంస్థ పాలకవర్గ సబ్యులు మరియు అధికారులు, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents