న్యూ ఇయర్ నుండి నిలిచి పోనున్న వాట్సప్ సేవలు…
రెండు రోజుల్లో నూతన సంవత్సరం రాబోతోంది. ఈ నూతన
సంవత్సరంలో కొన్ని ఫోన్లలో ఇక వాట్సాప్ పనిచేయదు. పాత ఓఎస్ వెర్షన్ మొబైళ్లకు సేవలు నిలిపివేయాలని వాట్సాప్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జనవరి 1 నుంచి మిలియన్ల కొద్దీ పాత ఫోన్లకు వాట్సాప్ సేవలు ఆగిపోనున్నాయి. వాటితో పాటు కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో కూడా వాట్సప్ పనిచేయదు. ఒక వేళ మీ ఫోన్లు యాపిల్, ఆండ్రాయిడ్ ఓఎస్ అప్ డేట్ కు సపోర్ట్ చేయకపోతే వీలైనంత త్వరగా వాట్సాప్ డేటాను రికవరీ చేసుకోవడం మంచిది.
వాట్సప్ పనిచేయని ఫోన్ లు ఇవే..
> ఐఓఎస్ 9 (ఐఓఎస్-9) కన్నా.. పాత వెర్షన్ ఐఫోన్ వాడుతున్న వారికి కొత్త ఏడాది నుంచి వాట్సాప్ సేవలు ఆగిపోనున్నాయి. అంటే ఐఫోన్ 4 లో ఇకపై వాట్సాప్ నిలిచిపోతుంది.
> ఐఫోన్ 4ఎస్, 5, 5ఎస్, 5సీ, 6, 6ఎస్ (ఐఫోన్ 4ఎస్, 5, 5ఎస్, 5సీ, 6, 6 ఎస్) వంటి ఫోన్లను ఐఓఎస్ 9 కి అప్ డేట్ చేసుకుంటే వాట్సాప్ వాడుకునేందుకు వీలుంది.
> ఆండ్రాయిడ్ 4.0.3 వెర్షన్ కన్నా పాత వెర్షన్ తో నడుస్తున్న వాటికి జనవరి 1 నుంచి వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి.
> మీ ఫోన్ ఆండ్రాయిడ్ 4.0.3, అంతకన్నా కొత్త వెర్షన్‌కు అప్ గ్రేడ్ అయితే అందులో వాట్సాప్ వాడుకునేందుకు వీలుంది.