వేగంగా వెళ్తున్న కారులో నిద్రపోయిన డ్రైవర్,
ఎలాన్ మస్క్(Elon musk) సంస్థ.. టెస్లా (Tesla) తయారు చేసిన కార్లలో ఆటోపైలట్ ఫీచర్ ఎంతో ప్రత్యేకమైనది. ఇది చాలా హైప్ తీసుకొచ్చింది. ఈ ఫీచర్ వల్ల రోడ్లపై కారు అదే సొంతంగా డ్రైవ్ చేసుకుంటుంది. డ్రైవర్ ఉండాల్సిన అవసరమే లేదు. దీన్ని ఉపయోగించుకొని ఓ టెస్లా కారులో డ్రైవర్, ప్యాసింజర్ నిద్రపోతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కారులో ఉన్న వారికి కంఫర్ట్‌గానే ఉన్నా.. వీడియో చూసిన వారు మాత్రం భయపడ్డారు. అలాగే టెస్లా కార్లు భారత్‌లోకి రానున్నాయని, అసలు ఈ ఫీచర్ ఇక్కడ ఉపయోగించడం అయ్యే పనేనా అని అభిప్రాయపడ్డారు.
టెస్లా ఆటో పైలట్ ఫీచర్ గురించే చర్చ విపరీతంగా నడుస్తోంది. అడ్వాన్స్ డ్రైవర్ అసిస్టెంట్స్ సిస్టమ్, ట్రాఫిక్ సిగ్నళ్లను పాటించడం, లేన్ సెంటరింగ్, సెల్ఫ్ పార్కింగ్, ఆటోమేటిక్ లేన్ చేంజింగ్, సెమీ ఆటోనమస్ నావిగేషన్ ఇలా ఎన్నో సదుపాయాలు ఉన్నాయి. అయినా కారుకు డ్రైవరే బాధ్యత వహించాలి. అయితే కారు వేగంగా వెళుతున్నా డ్రైవర్, ప్యాసింజర్ నిద్రపోయిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది ఎక్కడ జరిగిందో కరెక్ట్ లొకేషన్ తెలియకున్నా.. ఇది చూసిన నెటిజన్లు మాత్రం భయం వ్యక్తం చేశారు.
— Learn Something (@knowIedgehub) January 16, 2021
— Learn Something (@knowIedgehub) January 16, 2021
కొందరు ఇది బాధ్యత లేని పని అంటే.. మరికొందరు భయమేస్తోందని రిప్లేలు ఇచ్చారు.’నాకు ఈ చర్య ఏ మాత్రం నచ్చలేదు. ఆటో పైలట్ ఫీచర్ ఉన్నా సరే డ్రైవింగ్ చేసేటప్పుడు నిద్రపోవడం ప్రశ్నించాల్సిన విషయం, బాధ్యతారాహిత్యం’ అని ఓ నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఇది చాలా ప్రమాదకరం అని మరికొందరు స్పందించారు.
Driver and passenger both sleeping in Tesla 😬
via u/hasnayn123 pic.twitter.com/qUQ4p4ywCN
— Learn Something (@knowIedgehub) January 16, 2021