యువకుడిపై బీరుసీసాతో దాడి
జగిత్యాల : జగిత్యాల జిల్లా రేచపల్లి గ్రామంలో ఒక యువకునిపై అదే గ్రామానికి చెందిన మరో యువకుడు బీరు సీసాతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన శనివారం చోటు చేసుకున్నట్లు సారంగాపూర్ ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం సందీప్ ప్రశాంత్ అనే యువకునిపై అదే గ్రామానికి చెందిన కొడిపల్లి గంగాధర్ మద్యం సేవించేటప్పుడు గొడవ జరిగి దాడికి పాల్పడ్డాడని అన్నారు. గంగాధర్ పై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు