లవర్ రింగ్ కొట్టేసి మరో అమ్మాయికి ప్రపోజ్ చేసాడు

0 0

ఫిబ్రవరి 14న వచ్చిందంటే చాలు ప్రేమికులు తమ ప్రియమైన వారి కోసం గిఫ్టులు ఇచ్చి ఆనందిం పజేస్తుంటారు. నచ్చిన వ్యక్తికి తమ ప్రేమను చెప్పేందుకు చాలా మంది గిప్టు, సర్‌ప్రైలను ప్లాన్ చేస్తుంటారు. ఎలాగైనా నచ్చిన వ్యక్తి మనసు దోచేయాలని ఆరాటపడుతుంటారు. అయితే ఓ యువకుడు మాత్రం తన గర్ల్ ఫ్రెండ్ కు వింతైన బహుమతి ఇచ్చాడు. ఇంతకు ముందే తనతో ఎంగేజ్మెంట్ అయిన లవర్ ఉంగరాన్ని దొంగలించి..మరో గర్ల్ ఫ్రెండ్ కు ఇచ్చి ప్రపోజ్ చేశాడు. అమెరికాలోని ఫ్లోరిడాలో ఈ ఆసక్తికర ఘటన జరిగింది. జోసెఫ్ డేవిస్ తో ఎంగేజ్ మెంట్ చేసుకున్న యువతి అతడి ఫేస్ బుక్ చెక్ చేసింది. ఇంతలో అతడి వ్యవహారం బట్టబయలైంది. ఓ ఫొటోలో తనకు కాబోయే వాడు మరో యువతితో ఉండటాన్ని చూసి ఆశ్చర్యానికి గురైంది.

అయితే ఆ అమ్మాయి చేతికి తాను ప్రత్యేకంగా చేయించుకున్న రింగ్ ఉండడాన్ని చూసింది. వెంటనే తన జ్యూవెలరీ బాక్సను తీసింది. అందులో రింగ్ తో పాటు తన బామ్మకు చెందిన డైమండ్ రింగ్ కూడా మిస్ అయ్యింది. వాటి విలువ సుమారు 6,270 డాలర్లు. కోపంతో రగిలిపోయిన ఆమె కాబోయే భర్త వద్దకు వెళ్లి నిలదీసింది. అయితే తాను కొట్టేసిన వస్తువుల్లో కొన్నింటిని అతడు తిరిగి ఇచ్చేశాడు. ఆ తర్వాత ఆ ఇద్దరు అమ్మాయిలు అతడిని వదిలేశారు. అక్కడితో ఆగిపోలేదు. డేవిడ్ తనకు కాబోయే భార్యను ఓ ఇంటికి తీసుకెళ్లి ఆ రింగ్, జ్యువెలరీ తనవేనని వాదించాడు. తనతోనే ఉండాలని ఆమెను కోరాడు అందుకు ఆమె ససేమిరా అనడంతో అది కాస్త బ్రేకప్ అయ్యింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents