మందు బాబుల ఆగడాలు..
జిల్లాలో మందు బాబుల ఆగడాలు జోరందుకున్నాయి. తప్ప తాగిన మైకంలో వాహనాలు నడిపి బాటచారులకు మందు బాబులు తానొప్పిగా మారారు. తాగర అన్న తాగి ఊగర అన్న రీతిలో తాగి వాహనాలు నడుపుతున్నారు. పోలీసులు తాగి వాహనాలు నడిపితే సదర్ వ్యక్తిపై కేసుతో పాటు వాహనాన్ని సీజ్ చేస్తున్నారు. తాగితే అనర్థం.. తాగడం వాళ్ళ ఇల్లు గొల్ల అవడం తో పాటు.. భార్య పిల్లలు ఆగం ఆగం అవుతారు. పని పాట లేకుండా తాగి ఊగడం వాళ్ళ ఆరోగ్యం దెబ్బ తింటుంది అని సలహాలు, సూచనలు చేస్తూనే ఉన్నారు. మందు బాబుల ఆగడాలపై పోలీసులు సీరియస్ గా తీసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ ముమ్మరం చేస్తున్నారు. తప్ప తాగి వాహనాలు నడిపిన వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి వాహనాన్ని తనికీ చేస్తూ. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే కేసులు నమోదు చేస్తున్నారు. పోలీసులు ఎంత సీరియస్ గా తీసుకున్న ఈ మందు బాబుల ఆగడాలు ఆగడం లేదు.