మోడీ ప్రభుత్వం ఘోరంగా విఫలం :చాడ వెంకట్ రెడ్డి ఆరోపణ

0 0

ప్రధానినరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఉగ్రవాదాన్ని అంతమొందించడంలో ఘోరంగా విఫలమైందని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఆరోపించారు. ఫుల్వమా దాడి ఘటన రెండు సంవత్సరాలు ఫుర్తయిన సందర్బంగా ఆదివారం హైదరాబాద్ ట్యాంక్ బండ్, మిలిటరీ ట్యాంక్ వద్ద సిపిఐ “ధైర్య సైనికులకు వందనం” కార్యక్రమం నిర్వహించి ఫుల్వమా దాడిలో అమరులైన వీర జవాన్ లకు చాడ వెంకట్ రెడ్డి, సిపిఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఈ.టి. నరసింహ తోపాటు పలువురు నాయకులూ, కార్యకర్తలు కొవ్వొత్తులు వెలిగించి ఘనంగా నివాళులు అర్పించారు. 2014 సంవత్సరంలో విడుదల చేసిన ఎన్నికల మ్యానిఫెస్టోలో ఉగ్రవాదంపై “జీరో టాలరెన్స్” విధానాన్ని అవలంబిస్తామని బిజెపి చేసిన ప్రతిజ్ఞ ఏమైందని అయన ప్రశ్నించారు. తరచు ఉగ్రవాద దాడులు జరిగి మన భద్రతా సిబ్బంది మరణిస్తుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ దాడులకు పాకిస్థాన్ నే కారణమని పేర్కొని చేతులు దులుపుకోవడం తప్ప ఉగ్రవాద నిర్ములనకు నిర్మాణాత్మక, పటిష్టమైన చెర్యలు ఏవి తీసుకోవట్లేదని అయన మండిపడ్డారు. దేశ సంపదను కార్పొరేట్, విదేశి పెట్టుబడిదారులకు అమ్ముకోవడంలో ప్రధాని మోడీకి ఉన్న ఆసక్తి దేశ భద్రతపై లేదని అయన ఆగ్రహం వ్యక్తం చేసారు. అన్ని రంగాల్లో ఫుర్తిగా విఫలమైన బీజేపీ ప్రభుత్వానికి వ్యతరేకంగా దేశవ్యాప్తంగా తమ నిరసనలను విస్తరిస్తామని వామపక్ష, ప్రజాతంత్రవాదులందరు ప్రతిజ్ఞ చేయాలనీ ఈ.టి. నరసింహ కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ హైదరాబాద్ జిల్లా కార్యవర్గ సభ్యులు టి. రాకేష్ సింగ్, సలీం ఖాన్, నిర్లేకంటి శ్రీకాంత్, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మరుపాక అనిల్ కుమార్, డి.హెచ్.పి.ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు ఆరుట్ల రాజ్ కుమార్, సిపిఐ నేతలు ఆర్. మల్లేష్, చైతన్య యాదవ్, ఇంతియాజ్, మామిడిచెట్ల వెంకట్ స్వామి , శ్రీమాన్ తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents