పుల్వామా వీర జవాన్లకు ఘన నివాళ్లు
వీర జవాన్ల స్ఫూర్తితో నల్ల చట్టాలపై పోరాడుదాం
CITU, వ్యవసాయ కార్మిక సంఘం, SFI ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పుల్వామా ఉగ్రవాద దాడిలో మరణించిన వీర జవాన్లకు కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించి, ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు జిల్లా కార్యదర్శులు గుడికందుల సత్యం,ఎడ్ల రమేష్ లు మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం పుల్వామా వీర జవాన్ల మరణాన్ని సానుభూతిగా మలుచుకొని రాజకీయంగా వాడుకుంటోందని అన్నారు.వీర జవాన్ల ఆకాంక్షలను తుంగలో తొక్కుతూ,రక్షణ రంగాన్ని ప్రైవేటీకరణ చేస్తుందని, కేంద్ర బడ్జెట్ లో రక్షణ రంగానికి కోత విధించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 78 రోజులుగా రైతులు నల్ల చట్టాలను రద్దు చేయాలని శాంతియుతంగా పోరాడుతుంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులపై దాడులకు దిగుతుందని అన్నారు. పుల్వామా ఘటనలో అమరులైనవీర జవాన్ల స్ఫూర్తితో నూతన వ్యవసాయ చట్టాల రద్దుకై పోరాడుతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో CITU జిల్లా అధ్యక్షులు U. శ్రీనివాస్, ఉపాధ్యక్షులు బండారి శేఖర్, పున్నO రవి,SFI జిల్లా కార్యదర్శి శనిగరపు రజనీకాంత్, ఉపాధ్యక్షులు శ్రీకాంత్,CITU నాయకులు మల్లన్న, వాసుదేవ రెడ్డి SFI నాయకులు అరవింద్, ఆంజనేయులు, నవీన్ రోహిత్ ,రాజేష్, రత్నం సురేష్ తదితరులు పాల్గొన్నారు.