షర్మిల అంటే తెరాసలో ప్రకంపనలు
మంత్రి గంగులకు భయమెందుకు.. ?
తెలంగాణలో వైస్ షర్మిల రాజకీయ పార్టీ పెడుతుండడంతో అధికార తెరాస లో ఒక్క సారిగా రాజకీయ ప్రకంపనలు చెలరేగుతున్నాయని వైఎస్సార్ షర్మిల పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకుడు చెదలు సత్యనారాయణ విమర్శించారు. వైస్ షర్మిలను విమర్శించే స్థాయి మంత్రి గంగుల కమలాకర్ కు లేదని అన్నారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే నాయకులు వద్దని అన్నారు. వైస్ షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ పెడితే మంత్రి గంగుల కమలాకర్ కు భయమెందుకని విమర్శించాడు. కరీంనగర్ కౌన్సిలర్ గా ,MLA గా ఆంధ్ర TDP పార్టీ చంద్రబాబు నాయకుడి ఆధ్వర్యంలో గెలిచి, తెలంగాణ రాష్ట్రంలో TRS party lo చేరి kCr గారి పదవులకు ఆశ పడి గంగుల కమలాకర్ మంత్రిపదవులు అనుభవిస్తున్నారని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి Ys Rajashekhara reddy గారి కుమార్తే ,తెలంగాణ కొడలు, షర్మిలమ్మను విమర్శించే స్థాయి గంగుల కమలాకర్ కు లేదని చెదలు సత్యనారాయణ పేర్కొన్నారు.